8 వ తరగతిలోనే వాడు ఆ వీడియోలు చూస్తూ నాపై లైంగిక దాడి.?బాబాయ్ కొడుకు గురించి సంచలన విషయాలు బయటపెట్టిన 'అమృత'.!     2018-09-18   09:17:09  IST  Sainath G

అమృత వర్షిణిని, ప్ర‌ణ‌య్..ప్ర‌స్తుతం తెలుగు ప్ర‌జ‌ల్ని అవేద‌న‌కు గురిచేస్తున్న ప్ర‌మేజంట‌.. అరు మాస‌ల క్రితం పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని త‌మ బ్ర‌తుకు తాము బ్ర‌తుకుతున్న‌..ప్రేమ ప‌క్షులు. త‌మ అనురాగానికి ప్ర‌తిఫ‌లంగా త్వ‌ర‌లొనే త‌మ ఇంట మ‌రో మ‌నిషిరాబోతున్నాడ‌ని సంబుర‌ప‌డేలోపే..విధి వారితో అడుకుంది. అమాయి తండ్రే కాల‌య‌ముడ‌య్యి..క‌క్ష‌క‌ట్టి వారిని విడ‌దీసాడు. ప్ర‌ణ‌య్ ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చాడు. ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది.తన కూతురు ప్రేమ వివాహం చేసుకొంటే మారుతీరావు సహించలేకపోయాడు. అంతేకాదు తక్కువ కులానికి చెందిన ప్రణయ్ తన కూతురును పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఈ నేపథ్యంలో అమృత సంచలన విషయాలు బయటపెట్టింది.

తన తండ్రితో పాటు బాబాయ్ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని ఆమె చెప్పింది. ఆయన వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడని తెలిపింది. వాళ్ల కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమృత వర్షిణి చెప్పింది. ఈ విషయాన్ని బాబాయ్‌కు చెబితే ‘అబ్బాయిలు అలానే ఉంటారు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పాడని ఆమె బయటపెట్టింది.

తన తమ్ముడు ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే పోర్న్ చూడటం మొదలు పెట్టాడని.. ఈ విషయం వాళ్ళమ్మకు చెబితే మగపిల్లలు అలాగే ఉంటారని చెప్పిందని ఆమె వివరించింది. అంతేకాదు తనతో అసబ్యంగా ప్రవర్తించాడని వాడి గురించి బాబాయ్ కి చెబితే నన్నే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చింది. తాను చేసింది తప్పుగా భావించే బాబాయ్.. ఆయన వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తప్పుకాదా అని ప్రశ్నించింది. ఒక తల్లి నుంచి అలాంటి సమాధానం రావడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించింది. తనతో పాటు బంధువులలో ఉన్న చాలామంది అమ్మాయిలతో తన బాబాయ్ కొడుకు తప్పుగా ప్రవర్తించాడని అమృత వర్షిణి సంచలన విషయాన్ని బయటపెట్టింది.