మారుతీ రావు ని తన తమ్ముడే చంపి ఉంటాడంటున్న అమృత...  

Amrutha Sensational Comments On Maruthi Rao - Telugu Amrutha, Amrutha And Pranay Love News, Amrutha React About Maruthe Rao Death, Death, Amruthalatest News, Maruthirao Death News, Pranay Amrutha

అప్పట్లో ప్రణయ్ అమృత అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని డబ్బు తీసుకొని హత్యలు చేటువంటి కొందరు వ్యక్తులు పురమాయించి చంపించిన ఘటన ఇప్పటికీ అందరికీ బాగానే ఉంటుంది.అయితే ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావుని పోలీసులు అరెస్టు కూడా చేశారు.

 Amrutha Sensational Comments On Maruthi Rao

  ఇటీవల కాలంలో భారతీయ రావు బెయిల్ మీద వచ్చి తన కూతురిని తన వద్దకు రప్పించుకునే విశ్వప్రయత్నాలు చేశాడు.కానీ ఆమె తన భర్త పై ఉన్నటువంటి ప్రేమ మరియు తన కుటుంబం పై ఉన్న మమకారంతో తండ్రి వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది.

అయితే తాజాగా శనివారం రోజున మారుతీరావు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే ఈ మారుతీ రావు మృతిపై అమృతా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

మారుతీ రావు ని తన తమ్ముడే చంపి ఉంటాడంటున్న అమృత…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా మారుతీ రావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మారుతీ రావు తమ్ముడు అయినటువంటి శ్రవణ్ చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.అయితేఇందుకు వివరణ ఇస్తూ ఇటీవల కాలంలో మారుతీరావు కుటుంబంలో ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడ్డాయని తన సన్నిహితులు కొంతమంది తనతో చెప్పారని అన్నారు.

అయితే ఈ తగాదాల్లో మారుతీరావు కి మరియు అతని తమ్ముడు శ్రవణ్ కి కొంతమేర చెడిందని అప్పటి నుంచి ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేదని అన్నారు.

అయితే తన ఆస్తి విషయమై మారుతీ రావు ఈ విషయం గురించి మాట్లాడడానికి తన కూతురు అమృత నీ కలిసేందుకు హైదరాబాద్కు వచ్చాడని కానీ ఆమె నిరాకరించడంతో నే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈరోజు జరిగినటువంటి మారుతీ రావు అంత్యక్రియలకి అమృత ని హాజరు కాకూడదని తన తల్లి, బాబాయ్ శ్రవణ్ అడ్డుకున్నారు.అయితే ఈ విషయాన్ని గురించి కూడా అమృత స్పందిస్తూ మారుతీ రావు కడసారి చూపు చూసుకునేందుకు తనని అనుమతించకపోవడం పై తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

ఏదేమైనప్పటికీ ఒక తండ్రి తన కన్న కూతురి పై అమితమైన ప్రేమే తన కన్న కూతురి జీవితం, మరియు తన జీవితం నాశనం చేసిందని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amrutha Sensational Comments On Maruthi Rao Related Telugu News,Photos/Pics,Images..