సోషల్ మీడియాలో వైరలవుతున్నా అమృత -ప్రణయ్ ల డబ్ స్మాష్ వీడియోలు..     2018-09-16   05:16:13  IST  Rajakumari K

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువుహత్య అందరితో కంటతడి పెట్టిస్తోంది.ప్రణయ్ ,అమృతకు ఒకరు అంటే మరొకరికి పిచ్చి ప్రేమ…వారిద్దరిది నిన్న మొన్నటి ప్రేమ కాదు..స్కూల్ డేస్ నుండి వారిద్దరూ ఒకరంటే ఒకరిష్టపడ్డారు..వయసుతోపాటే వారి ప్రేమ పెరుగుతూ వచ్చింది.సోషల్ మీడియాలో వైరలవుతున్న వారిద్దరి ఫోటోలు,డబ్ స్మాష్ వీడియోలు చూస్తే వారిద్దరూ ఎంత స్నేహంగా, ప్రేమగా ఉండేవారో తెలుస్తుంది

వారు చేసిన డబ్ స్మాష్ ల్లో కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలువుతున్నాయి.. వారు కొన్ని సినిమాల్లోని సన్నివేశాలకు తగినట్టు నటించి వారి ప్రేమను చూపించుకున్నారు.దేవుడా వీడికి కోంచం బ్రేన్ కట్ చేయి పిచ్చివాడైనా పెంచుకుంటా అని చెప్పింది. అంటే పిచ్చోడైన ప్రణయ్‌తో ఉంటానని ,అంటే ప్రణయ్ అంటే ఆమెకు ఎంతో ప్రేమో అని తెలుస్తోంది. అలాగే ప్రణయ్ కూడా అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ సన్నివేశానికి ‘ మనకు ఏమైన ఐతే,పోతే మోస్ట్ ఎఫెక్టడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు నా లైప్‌లో ఆ పిల్ల,ఆపిల్లకు ఏమైనా ఐతే ఐ విల్ బీ మోస్ట్ ఎఫెక్ట్‌డ్ ఒకే ..అని చెప్పాడు. అమృతపై కూడా ప్రణయ్‌కి ఎనలేని ప్రేమ . అందుకే అమృత తండ్రి ఎన్ని డబ్బులు కావాలని బేరసారలకు పాల్పడిన నీ బిడ్డ కంటే నాకు ఏది ఎక్కవ కాదని చెప్పాడు.చివరికి బలయ్యాడు… వారిద్దరి డబ్ స్మాష్ వీడియోలు మీరూ చూడండి..