ప్రణయ్ పై ప్రేమను తలచుకుంటూ అమృత రాసిన ప్రేమ కావ్యం ఇదే.! ఫేస్బుక్ లో అమృత పోస్ట్.!

అమృత వర్షిణిని, ప్ర‌ణ‌య్.ప్ర‌స్తుతం తెలుగు ప్ర‌జ‌ల్ని అవేద‌న‌కు గురిచేస్తున్న ప్ర‌మేజంట‌.

 Amrutha Love Letter To Pranay-TeluguStop.com

అరు మాస‌ల క్రితం పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని త‌మ బ్ర‌తుకు తాము బ్ర‌తుకుతున్న‌.ప్రేమ ప‌క్షులు.

త‌మ అనురాగానికి ప్ర‌తిఫ‌లంగా త్వ‌ర‌లొనే త‌మ ఇంట మ‌రో మ‌నిషిరాబోతున్నాడ‌ని సంబుర‌ప‌డేలోపే.విధి వారితో అడుకుంది.

అమాయి తండ్రే కాల‌య‌ముడ‌య్యి.క‌క్ష‌క‌ట్టి వారిని విడ‌దీసాడు.

ప్ర‌ణ‌య్ ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చాడు.ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది.

తన కూతురు ప్రేమ వివాహం చేసుకొంటే మారుతీరావు సహించలేకపోయాడు.అంతేకాదు తక్కువ కులానికి చెందిన ప్రణయ్ తన కూతురును పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించాడు.

తన భర్త రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీళ్లతో కాలం గడుపుతోంది.ప్రణయ్‌తో తన ప్రేమాను బంధాన్ని తెలుపుతూ ఫేస్ బుక్‌‌లో పెట్టిన పోస్టు.

“ప్రేమంటో ఏంటో నిన్ను చూశాకే తెలిసింది.నీ చిరునవ్వు చూశాకే నవ్వితే ఇంత అందంగా ఉంటుందా అని తెలిసింది.నేను జీవించే ప్రతి రోజూ చాలా అద్భుతంగా ఉందనిపిస్తోంది.ఎందుకంటే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టిన దగ్గర్నుంచే రోజు ఇంత ఆనందంగా ఉంటుందా అని అనిపించింది.నీ తలపులతోనే రోజు ముగుస్తుంది.” అని తమ మధ్య ఉన్న ప్రేమను అమృత వివరించింది.

మరో సందర్భంలో ప్రణయ్‌పై తనకు ఉన్న ఎంత ప్రేమ ఉందో తెలియ చెప్పే మరో పోస్ట్.

“నిజమైన ప్రేమకు ప్రతిరూపాలు హంసలు… అవి మాత్రమే జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి.99 శాతం హంసలు కడవరకు ఒక్క భాగస్వామితోనే తమ ప్రేమను పంచుకుంటాయి.ఒకవేళ జీవిత భాగస్వామి మరణిస్తే అవి కూడా మరణిస్తాయి.

నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుంది” అని అమృత పోస్ట్ పెట్టింది.

ప్రణయ్ పై అమృతకు ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ పోస్టు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube