మోడీని 'జాతిపిత' చేసిన సీఎం భార్య  

Amruta Fadnavis Comments On Narendra Modi-social Media

సెలబ్రెటీలు లేదా నలుగురిలో పేరు ఉన్న వారు ఏం మాట్లాడినా కూడా చాలా మంది ఆ మాటను వింటారు, స్పందిస్తారు అనే విషయాన్ని గుర్తించాలి.సెలబ్రెటీ అన్నప్పుడు మాటలో, చేతలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఒక్క మాట అన్నా కూడా దాన్ని వెనక్కు తీసుకోవడం కష్టం అవుతుంది.

Amruta Fadnavis Comments On Narendra Modi-social Media-Amruta Fadnavis Comments On Narendra Modi-Social Media

ముఖ్యంగా ఇప్పుడు సోషల్‌ మీడియా పరిధి చాలా పెరగడం వల్ల ఏ చిన్న మాట అన్నా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.ఆ విషయంను మహారాష్ట్ర సీఎం పడ్నవీస్‌ భార్య అమృత ఫడ్నవీస్‌ మర్చి పోయిందేమో అనిపిస్తుంది.

Amruta Fadnavis Comments On Narendra Modi-social Media-Amruta Fadnavis Comments On Narendra Modi-Social Media

నిన్న నరేంద్ర మోడీ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్‌ మాట్లాడుతూ జాతిపిత నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యలు చేసింది.ఆమె అవగాహణ రాహిత్యంతో చేసిందో లేక భారత్‌కు మోడీని మరో జాతిపితగా ఆమె స్వయంగా మార్చిందో తెలియదు కాని ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.జాతిపిత ఎవరు అనే విషయం తెలియకుండానే మీరు ఎలా ఒక సభలో మాట్లాడతారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.