అతి చేస్తా కాని శృతి మించను అంటున్న ఫుట్ బాల్ ప్లేయర్  

Amritha Aiyer Open Up Glamour Roles Red Movie - Telugu Amritha Aiyer Open Up Glamour Roles, Kollywood, Red Movie, Telugu Cinema, Tollywood

సౌత్ సినిమాలలో ఈ మధ్య కొత్త అందాల భామల హవా ఎక్కువైంది.చాలా కాలంగా ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలని పక్కకి తోసి తమ అందంతో దర్శకుల మనసు దోచేస్తూ వరుసగా అవకాశాలని అందిపుచ్చుకుంటూ ముందుకి వచ్చేస్తున్నారు.

 Amritha Aiyer Open Up Glamour Roles Red Movie - Telugu Amritha Aiyer Open Up Glamour Roles, Kollywood, Red Movie, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఈ వరుసలో ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ అమృత అయ్యర్ కూడా వచ్చి చేరింది.తమిళంలో విజయ్ బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కీలక పాత్రలో నటించిన అమృత ఆ సినిమా సక్సెస్ తో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.

ప్రస్తుతం తెలుగులో ప్రదీప్ తో కలిసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో గ్రాండ్ గా అమృత అయ్యర్ ఎంట్రీ ఇస్తుంది.

అతి చేస్తా కాని శృతి మించను అంటున్న ఫుట్ బాల్ ప్లేయర్ - Amritha Aiyer Open Up Glamour Roles Red Movie - Telugu Amritha Aiyer Open Up Glamour Roles, Kollywood, Red Movie, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండానే రామ్ కి జోడీగా రెడ్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది.

వీటితో పాటు మరో రెండు తెలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.త్వరలో ఇవి సెట్స్ పైకి వెళ్తాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా కెరియర్ లో తన జర్నీ గురించి అమృత షేర్ చేసుకుంది.నేను సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చాను.

మా వైపు నుంచి సినిమాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే.సినిమానే జీవితమనుకుని రాలేదు.

ఏదో సరదాగా ఒకటి రెండు సినిమాలు చేసి వెళదామని వచ్చాను.బిగిల్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

తెలుగులో ఒక సినిమా చేస్తుండగానే కొత్త ఆఫర్లు వచ్చాయి.ఇది గ్లామర్ ఫీల్డ్ అనే విషయం నాకు తెలుసు.

నా వరకూ హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపించేంతవరకూ అయితే ఓకే.అంతకుమించి అంటే నా వల్ల కాదు అని తన మనసులోని మాటను చెప్పేసింది.

తాజా వార్తలు

Amritha Aiyer Open Up Glamour Roles Related Telugu News,Photos/Pics,Images..