అమృత అయ్యర్ ఈ పేరు వినగానే చాలా మందికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గుర్తుకు వస్తుంది.యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత హీరో శ్రీ విష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమాలో కూడా అమృత అయ్యర్ నటించింది.అయితే ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ సినిమాలో అమృత.
నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇదిలా ఉంటే వారం రోజుల కిందట అమృత అయ్యర్ సోషల్ మీడియాలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ ఒక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని.మెసేజ్ లు కానీ ఇతర సందేశాలు వస్తే రిప్లై ఇవ్వద్దు అంటూ అమృత అయ్యర్ తన అభిమానులను అప్రమత్తం చేసింది.
అయితే మొత్తానికి తన అకౌంట్ తన చేతికి వచ్చింది అంటూ అమృత తాజాగా ప్రకటించింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.ఈ ట్వీట్ ద్వారా అసలు విషయాన్ని చెప్పేసింది.ఇలాంటివి ఎక్కువగా సెలబ్రిటీలకు వస్తూ ఉంటాయి.
సెలబ్రిటీ అకౌంట్లు ఎప్పుడూ కూడా హ్యాకర్ల బారిన పడుతూ ఉంటాయి.
వాటిని మళ్లీ తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి సెలబ్రెటీలు చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయిస్తూ ఉంటారు.అయితే పోయిన అకౌంట్ మళ్లీ నా చేతిలోకి వచ్చింది.
ఈ వారం రోజులు మీరు నా మీద చూపించిన ప్రేమ కు పొంగిపోయాను.మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను పాజిటివ్ గా ఉండగలిగాను అని చెప్పుకొచ్చింది అమృత అయ్యర్.
మీ అందరి మెసెజ్‌లను ట్విట్టర్‌లో చూస్తూ వచ్చాను.మీరు నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ వేసింది.