అమృత్ ఉద్యాన్‌‌లో అలరించే విశేషాలివే..

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని చారిత్రాత్మక మొఘల్ గార్డెన్స్ పేరు మార్చారు.ఇప్పుడు దానికి అమృత్ ఉద్యాన్‌ అనే పేరు పెట్టారు.

 Amrit Udyaan Entertainers Are Special , Amrit Udyaan  ,  Entertainer ,  Special-TeluguStop.com

అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను గుర్తుచేస్తూ ఈ గార్డెన్ పేరు ఇలా మార్చారు.మొఘల్ గార్డెన్ పర్యాటకులకు పెద్ద ఆకర్షణీయ కేంద్రం.

ఇక్కడ బ్రిటీష్, మొఘల్ గార్డెన్‌ల తీరుతెన్నులను చూడవచ్చు.వివిధ రకాల ఆకర్షణీయమైన పూలు, ముఖ్యంగా గులాబీలను చూడటానికి మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి ప్రజలు ఇక్కడకు వస్తారు.

జనవరి 31 నుండి ప్రజల సందర్శనార్థం…ప్రతి సంవత్సరం ఈ ఉద్యానవనాన్ని సామాన్య ప్రజల కోసం తెరుస్తారు.ఈ సంవత్సరం 31 జనవరి నుండి 26 మార్చి 2023 వరకు ఇది సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంచుతారు.

ఉద్యానవనం తెరిచే సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.ప్రత్యేక కేటగిరీ సందర్శకుల కోసం మార్చి 28 నుంచి మార్చి 31 వరకు కేటాయించారు.ఈ కేటగిరీలో రైతులు, దివ్యాంగులు, మహిళలు తదితరులకు ఒక్కొక్కరికి ఒక్కో రోజు కేటాయించారు.

138 రకాల గులాబీలు

138 రకాల గులాబీలు, 10,000 కంటే ఎక్కువ తులిప్ మొక్కలు, 70 రకాల జాతులకు చెందిన 5,000 కాలానుగుణ పుష్ప జాతులు ఇక్కడ ఉన్నాయి.ఇక్కడ తులిప్, మోగ్రా-మోటియా, రజనిగంధ, బేలా, రాత్ కీ రాణి, జుహీ, చంపా-చమేలీ వంటి అనేక రకాల పూలను చూడవచ్చు.క్యూఆర్ కోడ్ ఆధారంగా ప్రజలు వివిధ రకాల మొక్కల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

తోటలో సెల్ఫీ పాయింట్ కూడా ఉంది.దీంతో పాటు ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.

Telugu Amrit Udyaan, Azadika, Delhi, Garden, Mughal Gardens, Rose Flower-Latest

15 ఎకరాల్లో విస్తరించిన వనం

15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్ బ్రిటీష్ హయాంలో నిర్మించబడింది.ఈ తోటను తీర్చిదిద్దేందుకు బ్రిటిషన్ ఎడ్విన్ లుటియన్స్ మొదట మనదేశంతో పాటు ప్రపంచంలోని తోటలను అధ్యయనం చేశారు.ఈ తోటలో మొక్కలు నాటేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది.

Telugu Amrit Udyaan, Azadika, Delhi, Garden, Mughal Gardens, Rose Flower-Latest

అమృత్ ఉద్యాన్‌లో ప్రత్యేకతలివే

అమృత్ ఉద్యాన్‌లో గులాబీలు, వివిధ పూలు, సెంట్రల్ లాన్, లాగ్, వృత్తాకార, ఆధ్యాత్మిక, మూలికా, బోన్సాయ్, కాక్టస్, కాన్స్టెలేషన్ గార్డెన్‌లతో సహా 10 కంటే ఎక్కువ తోటలు ఉన్నాయి.ఇంతేకాకుండా సుమారు 160 రకాల ఐదు వేల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.ఇక్కడ కాన్స్టెలేషన్ గార్డెన్ కూడా ఉంది.

ప్రవేశం ఉచితంఎవరైనా అమృత్ ఉద్యాన్‌కు ఢిల్లీ మెట్రోలో వెళ్లాలనుకుంటే, సమీపంలోని మెట్రో స్టేషన్ సెంట్రల్ సెక్రటేరియట్.అమృత్ ఉద్యాన్‌లోకి ప్రవేశం ఉచితం.

అమృత్ ఉద్యానాన్ని క్లీనింగ్ కోసం సోమవారాలు మూసి ఉంచుతారు.ఇక్కడకి ఆహారం, పానీయాలను తీసుకెళ్లడాన్ని నిషేధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube