తెలుగు సినిమాకి ఒకే చెప్పా అంటున్న హైదరాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి- Amrin Qureshi Getting Chance In South

amrin qureshi Getting Chance in South, Tollywood Bollywood, Julayi Movie, Bollywood Beauties , Chance in South - Telugu @amrinqureshi99, Amrin Qureshi, Bollywood, Bollywood Beauties, Julayi Movie, South, Tollywood

మోడలింగ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా వేగంగా బాలీవుడ్ ఏకకాలంలో రెండు సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి.బాలీవుడ్ నిర్మాత షాజిద్ ఖురేషి కూతురుగా ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.

 Amrin Qureshi Getting Chance In South-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు హిట్ సినిమాలైన జులాయి, సినిమా చూపిస్తా మామా హిందీ రీమేక్ లలో నటిస్తుంది.ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి.

వీటితో పాటు సౌత్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.ఎలాగూ తండ్రి బడా నిర్మాత కాబట్టి తెలుగు ఎంట్రీ కూడా అమ్రిన్ ఖురేషికి పెద్ద కష్టం కాకపోవచ్చనే మాట వినిపిస్తుంది.

 Amrin Qureshi Getting Chance In South-తెలుగు సినిమాకి ఒకే చెప్పా అంటున్న హైదరాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా అమ్రిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ అమ్మడు తన సినిమా జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కథానాయికగా నా తొలి పుట్టినరోజు ఇది కాబట్టి ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నా.

ఇటీవలే హైదాబాద్‌లో వేసిన సెట్‌లో బ్యాడ్‌బాయ్‌ పాట చిత్రీకరణ చేశాం.దాదాపు షూటింగ్‌ మొత్తం పూర్తయింది.

త్వరలో జులాయి రీమేక్‌ ప్రారంభమవుతుంది.ఓ హైదరాబాద్‌ అమ్మాయిగా బాలీవుడ్‌లో బిజీకావడం చాలా ఆనందంగా ఉంది.

దక్షిణాది నుంచి కూడా మంచి ఆఫర్లొస్తున్నాయి.తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పినట్లు ఈ సందర్భంగా అమ్మడు చెప్పుకొచ్చింది.

అయితే అమ్రిన్ ఖురేషి ఎంట్రీ ఇచ్చే ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలని ఈ సందర్భంగా ఈ బ్యూటీ చెప్పడం విశేషం.

#@amrinqureshi99 #South #Amrin Qureshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు