అమరావతి ప్రశ్నిస్తోంది షర్మిలక్కా ?

తెలంగాణలో పార్టీ పేరు ప్రకటించకుండానే టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపదుతోంది వైఎస్ షర్మిల.  నిరుద్యోగ దీక్ష పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ , నానా హంగామా చేస్తూ , తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, త్వరలోనే తాను సీఎం అవుతాననే ఆకాంక్షను షర్మిల బయటపెట్టుకున్నారు.

 Amaravathi Women Activists Questioning Ys Sharmila , Amaravathi, Sharmila, Ys Ja-TeluguStop.com

నిరుద్యోగ దీక్ష సందర్భంగా తలెత్తిన చిన్నచిన్న పరిణామాలను రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు.తనను అనవసరంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అంటూ .త్వరలో ముఖ్యమంత్రి అయిపోతాను అంటూ షర్మిల మాట్లాడడం చర్చనీయాంశం అవుతోంది.త్వరలోనే పార్టీ పేరు ప్రకటించి యూత్ నుంచి ఎక్కువ మద్దతు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

దానిలో భాగంగానే నిరుద్యోగ దీక్ష మొదలుపెట్టిన ఆమె ఈ సందర్భంగా పోలీసులు తమపై దాడి చేశారంటూ షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో తన బిడ్డ జరిగిన అవమానంపై ఘాటుగానే మీడియా ముఖంగా స్పందించారు.

దీనిపై ఇప్పుడు ఏపీలో రాజకీయంగా దుమారం రేగుతోంది.ముఖ్యంగా అమరావతి నుంచి రాజధాని ని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుండటంతో, దానికి నిరసనగా దాదాపు 500 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

అయినా వైసీపీ పెద్దగా పట్టించుకోకపోగా , ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ అమరావతి నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు.షర్మిల ఒక్కరోజు దీక్షకే తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతూ , పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు అంటూ షర్మిల హడావుడి చేస్తున్నారని కానీ , తాము దాదాపు 500 రోజులుగా ఎన్నో అవమానాలు,  పోలీస్ దెబ్బలు తింటూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, అయినా మీ జగనన్న కనీసం మా మొహం కూడా చూడడం లేదు అని, ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Amaravathi, Sharmila, Trs, Ys Jagan, Ys Vijayamma-Telugu Political News

  ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.విజయమ్మ షర్మిలకు జన్మనిచ్చిన తల్లి అయినా, ముందుగా ఒక మహిళ.గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.వైసిపి గౌరవాధ్యక్షురాలు గా ఉన్నారు.అటువంటి విజయమ్మ ఇప్పుడు తెలంగాణలో తన కూతురుకు అన్యాయం జరుగుతోందని టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.కానీ అమరావతిలో తాము చేస్తున్న దీక్ష పై కనికరం చూపించలేదని,  మహిళలంటే గౌరవం కూడా లేదంటూ అమరావతి మహిళలు చేస్తున్నారు.

ఒకరోజు దీక్ష కే ఇంత హడావుడి చేస్తే,  500 రోజులుగా చేస్తున్న దీక్షకు మేము ఎంత హడావుడి చేయాలి అంటూ అమరావతి ఉద్యమ మహిళలు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube