వెంకటేష్ అలాంటి వ్యక్తి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమ్ము అభిరామి?

తెలుగులో రీమేక్ సినిమాల్లో ఎక్కువగా నటించి ఆ సినిమాలతో సక్సెస్ సాధించిన హీరోగా వెంకటేష్ పేరు తెచ్చుకున్నారు.అసురన్ రీమేక్ నారప్పతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న వెంకటేష్ త్వరలో దృశ్యం2 సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

 Ammu Abhirami Interesting Comments About Hero Venkatesh-TeluguStop.com

నారప్ప సినిమాలో ప్రియమణితో పాటు అమ్ము అభిరామి నటించిన సంగతి తెలిసిందే.అమ్ము అభిరామి క్యూట్ ఎక్స్ ప్రెషన్లు నారప్ప సినిమాకు హైలెట్ అవుతాయి.

ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అమ్ము అభిరామి కనిపించింది కొంత సమయమే అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తాజాగా ఈ బ్యూటీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Ammu Abhirami Interesting Comments About Hero Venkatesh-వెంకటేష్ అలాంటి వ్యక్తి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమ్ము అభిరామి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంకటేష్ ను ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో చూశానని ఆమె అన్నారు.ఆ సినిమాలో వెంకటేష్ తనకు చాలా స్మార్ట్ గా కనిపించారని అమ్ము అభిరామి అన్నారు.

వెంకటేష్ ఒక సెల్ఫీ తీసుకోవాలని భావించిన తనకు నారప్ప సినిమాలో ఛాన్స్ దక్కిందని అమ్ము అభిరామి చెప్పుకొచ్చారు.

Telugu Ammu Abhirami, Ammu Abhirami Movie Offers, Asuran Remake, Interesting Comments, Narappa Movie, Ott, Priyamani, Telugu Language, Tollywood, Venkatesh, Venkatesh Smart-Movie

నారప్ప మూవీలో ఛాన్స్ దక్కడం పట్ల లక్కీ అని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.అయితే వెంకటేష్ కు జోడీగా నటించాలంటే తాను కంగారు పడ్డానని వెంకటేశ్ గారు తనకు ధైర్యం చెప్పారని అమ్ము అభిరామి చెప్పుకొచ్చారు.తనకు తెలుగు రాదని భాష రాకపోవడం వల్ల కొన్నిసార్లు తాను ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

వెంకటేష్ తాను సీన్లలో బాగా నటించేలా హెల్ప్ చేశారని ఆమె చెప్పారు.

Telugu Ammu Abhirami, Ammu Abhirami Movie Offers, Asuran Remake, Interesting Comments, Narappa Movie, Ott, Priyamani, Telugu Language, Tollywood, Venkatesh, Venkatesh Smart-Movie

తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తే కచ్చితంగా నటిస్తానని ఈ బ్యూటీ తన మనస్సులోని మాటను బయటపెట్టారు.అమ్ము అభిరామి తెలుగులో గతంలో కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.తెలుగులో అమ్ము అభిరామికి కొత్త సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.

#Venkatesh #Priyamani #Ppa #Ammu Abhirami #Venkatesh Smart

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు