హైదరాబాద్‎కు చేరుకున్న అమ్మోనియం నైట్రేట్..!  

ammonium nitrate, hyderabad, chennai, - Telugu Ammonium Nitrate, Chennai, Hyderabad

హైదరాబాద్‎కు అమ్మోనియా నైట్రేట్ చేరుకుంది.లెబనాన్ రాజధాని బీరూట్‎లో జరిగిన భారీ పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ రసాయన పదార్ధం ఇప్పుడు 8 కంటైనర్లలో హైదరాబాద్‎కు చేరుకుంది.

TeluguStop.com - Ammonium Nitrate Reaches Hyderabad

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

బీరూట్‎లో భారీ పేలుడు సంభవించడంతో భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై పోర్టులో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్‎ను హైదరాబాద్‎కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది.మొత్తం ఎనిమిది కంటైనర్లలో తరలించిన నైట్రేట్‎ను కీసరగుట్టలో సాల్వో ఎక్స్‎ప్లోజివ్ కంపెనీ నిల్వ చేసింది.

TeluguStop.com - హైదరాబాద్‎కు చేరుకున్న అమ్మోనియం నైట్రేట్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అమ్మోనియం నైట్రేట్‎ను సాల్వో కంపెనీ రీప్రాసెస్ చేయనుంది.రెండు రోజుల్లో రీప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తవుతోందని సాల్వో కంపెనీ పేర్కొంది.

రీప్రాసెస్ ప్రక్రియ అనంతరం కోల్ ఇండియా, సింగరేణి, నీటి పారుదల ప్రాజెక్టులకు సరాఫరా చేయనుంది.

ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‎ను చెన్నై సమీపంలోని మనలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు.

గతంలో చెన్నై వరదల సమయంలో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ నీటిలో, గాల్లో కలిసిపోయినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బీరూట్ లో జరిగిన భారీ పేలుడుతో చెన్నై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.

దీంతో చెన్నైలో 37 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ ఉండగా 10 కంటైనర్లలోని 181 టన్నుల రసాయన మిశ్రమాన్ని హైదరాబాద్‎కు తరలించారు.

లెబనాన్ రాజధాని బీరూట్‎లో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.ఈ భారీ పేలుడులో 200 మంది మృతి చెందగా.వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులు అయ్యారు.

దీంతో బీరూట్‎లో పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ తమ ప్రాంతంలో నిల్వ చేయడంపై కీసరగుట్ట వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

#Hyderabad #Chennai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ammonium Nitrate Reaches Hyderabad Related Telugu News,Photos/Pics,Images..