అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఇదే!

అక్టోబర్ 17 నుంచి దేవీ నవరాత్రులు మొదలవడంతో అమ్మవారు ప్రత్యేకమైన అలంకారాలలో ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.ఈ నవరాత్రి వేడుకల ను ఎంతో మంది భక్తులు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు.

 Navaratri Naivedhyam To Amamvaru, Naivedhyam, Ammavaru, Hindu Rituals, Dussehra-TeluguStop.com

ప్రతిరోజు ఇంట్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసి వివిధ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు.నవరాత్రులలో భాగంగానే ఏరోజు అమ్మవారికి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలో ఇక్కడ తెలుసుకుందాం…

నవరాత్రుల లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారం లో దర్శనం కల్పిస్తారు.

మొదటి రోజు అమ్మవారికి పొంగలి ని నైవేద్యంగా సమర్పిస్తారు.రెండవ రోజు శ్రీ బ్రహ్మచారిని అలంకరణలో దర్శన భాగ్యం కలుగుతుంది.

రెండవ రోజున అమ్మవారికి పులిహోరా ను నైవేద్యంగా సమర్పించాలి.మూడవ రోజు అమ్మవారిని చంద్ర ఘాంట రూపంలో అనగా గాయత్రీ దేవి అలంకరణ లో కొలుస్తారు.

ఈ మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, లేదా కొబ్బరి పాయసం ని నైవేద్యంగా సమర్పిస్తారు.

నవరాత్రుల లో భాగంగా నాలుగవ రోజు కుష్మాండ శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంగా అలంకరిస్తారు.ఈ నాలుగవ రోజున మినప గారెలు, మొక్కజొన్న గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదవ రోజు అమ్మవారిని స్కంధమాత సరస్వతి దేవి అవతారం గా పూజిస్తారు.

ఆరవ రోజు కాత్యాయని దేవి, శ్రీ లలితా దేవి రూపంలో దర్శనం కల్పిస్తారు ఈ రోజున అమ్మవారికి కేసరి ని నైవేద్యంగా సమర్పించాలి.

ఏడవ రోజున కాలరాత్రి దుర్గాదేవి గా దర్శనం కల్పిస్తారు.

ఏడవ రోజున అమ్మవారికి కలగూర పులుసును నైవేద్యంగా సమర్పించాలి.ఎనిమిదవ రోజు అమ్మవారిని మహాగౌరి అలంకరణలో పూజిస్తాం.

ఈ రోజున రవ్వతో చేసినటువంటి చక్కెర పొంగలి అమ్మవారికి సమర్పించాలి.తొమ్మిదవ రోజున అంటే నవరాత్రులలో చివరి రోజున సిద్ది రాత్రి, శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

కొబ్బరి పాయసం, పెసరపప్పు పాయసం, లేదా సేమియా పాయసం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించవలెను.ఈ నైవేద్యాలను నవరాత్రుల లో భాగంగా ప్రతి రోజు అమ్మవారికి సమర్పించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది.

Navaratri Naivedhyam To Amamvaru, Naivedhyam, Ammavaru, Hindu Rituals, Dussehra Special, Navratri , Naivedyam Recipes - Telugu Navratri, Ammavaru, Dussehra, Hindu Rituals, Naivedhyam

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube