ఓ చిన్నారి ఆయువు తీసిన అమ్మ చీర.. !

పెద్దల ఎమరుపాటు చిన్నపిల్లలకు ప్రాణంతకంగా మారుతుందని ఎన్నో ఘటనలు నిరూపిస్తున్నాయి.ప్రస్తుతం ఇలాంటి ఘటనే నిన్న హైద‌రా‌బా‌ద్‌‌లోని నాచా‌రంలో చోటు‌చే‌సు‌కుంది.

 Amma Sari That Took The Life Of A-TeluguStop.com

ఆ పాప మరణానికి కారణం అమ్మ చీర అవ్వడం విషాదం.

ఇక పూర్తి వివరాలు చూస్తే.

 Amma Sari That Took The Life Of A-ఓ చిన్నారి ఆయువు తీసిన అమ్మ చీర.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాచా‌రంలో నివ‌సించే వల్లూరి రమే‌శ్‌ కూతురు మన‌స్విని (9) నాలుగో తర‌గతి చదు‌వు‌తు‌న్నది.కాగా వీరి బాబు మాన‌సిక విక‌లాం‌గుడు.

ఇకపోతే నిన్న ఈ దంపతులు ఇద్దరు పని నిమిత్తం బయ‌టకు వెళ్లగా, ఆ పాప ఆడుకునే ఆటలో భాగంగా ఇంట్లో ఉన్న ఫ్యాన్‌ కొక్కా‌నికి కుర్చి‌వే‌సు‌కొని చీరెతో ఊయల కట్టి ఊగసాగింది.

ఈ క్రమంలో మెడకు చీరె‌చు‌ట్టు‌కొని ఊపిరి ఆడక గిలగిలలాడుతూ మరణించింది.

ఆ సమయంలో అందుబాటులో ఎవరు పెద్దవారు లేకపోవడం దురదృష్టకరం.కాగా బయటకు వెళ్లిన తల్లి‌దం‌డ్రులు ఇంటికి వచ్చేసరికి ఆ పాప చీరెలో విగ‌త‌జీ‌విగా ఉన్నది.

పాపం అమ్మ చీరెతో ఆడుకోవాలనుకున్న ఆ పాప అనంతలోకాలకు పయణం అవడం ఆ తల్లిదండ్రులను విషాదంలో నింపింది.

#Nacharam #Child #Uppal #Dead

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు