నోయల్‌ ను కార్నర్‌ చేశారు

బిగ్ బాస్ గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్నేహితుడిగా హౌస్ లో ఈ సీజన్ లో అడుగు పెట్టిన నోయల్ అనూహ్యంగా కొందరికి టార్గెట్ అయ్యాడు.గత వారం లో ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ విషయంలో ఆయన కాస్త ఎమోషనల్ అయ్యాడు.

 Amma Rajashekhar Fire On Noel-TeluguStop.com

ఆమె వెల్తున్నసమయంలో కన్నీరు పెట్టుకోవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆ తర్వాత కూడా అంటే ఈ వారం నామినేషన్ సమయంలో కూడా ఆ విషయాన్ని తీసుకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అమ్మ రాజశేఖర్ నామినేట్ చేయడం వల్లనే స్వాతి ఎలిమినేట్‌ అయ్యిందని నోయల్ బలంగా నమ్ముతున్నాడు.ఆ కారణంతోనే అమ్మ రాజశేఖర్ ను నోయల్ ఈ వారం నామినేట్ చేయడం జరిగింది.

ఆ విషయంలో అమ్మ రాజశేఖర్ చాలా హర్ట్ అయినట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.నిన్నటి ఎపిసోడ్‌ లో నోయల్‌ ను అనుసరిస్తూ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ మరియు కుమార్ సాయిలు కామెడీ చేయడం నిన్నటి ఎపిసోడ్ లో ప్రధానంగా చూడవచ్చు.

నోయల్‌ ను అవమానిస్తున్న ట్లుగా అమ్మ రాజశేఖర్ మాట్లాడాడు అంటూ నోయల్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిని వారు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.సోషల్ మీడియాలో అమ్మ రాజశేఖర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.హౌస్ లో నోయల్ చాలా డీసెంట్ గా ఉంటాడు ఆ విషయాన్నే కామెడీగా మెహబూబ్ మరియు అమ్మ రాజశేఖర్ లు చెప్పడం అవివేకం అన్నారు.

ఈ విషయంలో వారు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది అంటూ నోయల్‌ అభిమానులు హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో రాజశేఖర్ మరియు మెహబూబ్ వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు.

ఇప్పటికే ఆయనకు మద్దతుగా రాహుల్‌ క్యాంపెయిన్‌ చేయిస్తున్నాడు.కనుక నోయెల్ ఈజీగా సేవ్‌ అవుతాడు అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో నోబెల్ కు వ్యతిరేకంగా ఉన్న వారికి చుక్కలు చూపించడం ఖాయం అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube