స్టార్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి!

స్టార్ మా లో వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ,అందులో ఇచ్చే టాస్క్ లు, వాళ్లు చేసే ఎంటర్ టైన్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన సన్నివేశంలో బిగ్ బాస్ ఇంట్లో కొన్ని మాటల వల్ల బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు.

 Amma Rajasekhar Motivates Avinash, Amma Rajasekhar,avinash, Amma Rajasekhar, Big-TeluguStop.com

అవినాష్, గంగవ్వ మార్నింగ్ మస్తీలో చెప్పిన కొన్ని విషయాలకు అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.ఎప్పుడు నవ్వుతు, నవ్విస్తూ, తిడుతూ ఉండే వీరి వెనుక ఇలాంటి కథలు ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

దీంతో ఇంట్లో ఉన్న వాళ్ళే కాకుండా టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా ఎమోషన్ అయ్యారు.అయితే గంగవ్వ, అవినాష్ చెప్పిన విషయాల గురించి ఇంట్లో వాళ్లు ధైర్యం చెప్పారు.

అవినాష్ తన సూసైడ్ విషయం గురించి చెప్పగా మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు పోవాలి కానీ ఇలాంటి నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోవద్దని అమ్మ రాజశేఖర్ తెలిపారు.

అప్పుడప్పుడు అలా జరిగిపోతాయి.

మన చేతిలో ఏమీ ఉండదు కానీ నా జీవితంలో ఆ ఆలోచన ఎదురయింది.నా జీవితంలో నేను ఏమి చేయలేకపోయినాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అవినాష్ అనగా వెంటనే అరేయ్ అట్లా మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తాను అంటూ ప్రతి చిన్న దానికి సూసైడ్ మార్గం కాదు అంటూ అమ్మ రాజశేఖర్ అన్నారు.

అంతే కాదు మన జీవితంలో తల్లిదండ్రులకు అలాంటి బాధలు పెట్టవద్దని.ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే ఎన్ని అవమానాలు వచ్చినా ముందుకు వెళ్లాలి తప్ప అలాంటి ఆలోచన రాకూడదని అన్నారు.

ఏదైనా ఒక్కసారికే సక్సెస్ రాదని ప్రయత్నిస్తేనే వస్తుందని ముక్కు అవినాష్ తో అమ్మ రాజశేఖర్ చెప్పారు.

జీవితం ఊహించని విధంగా ఉంటుంది.

అవి పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని అఖిల్ కూడా అవినాష్ కు సపోర్ట్ చేశాడు.ఇక గంగవ్వ తన బాధను చెబుతున్నప్పుడు ప్రేక్షకులైతే కంటతడి పెట్టేసారు.

ఆమె అలా చెప్తున్నప్పుడు తనకు అర్థం కాకున్నా … గంగవ్వ ముఖంలో బాధలు చూసి మోనాల్ కూడా ఏడ్చేసింది.గంగవ్వ అలా ఏడుస్తుంటే నాకు వెళ్లి కౌగిలించుకోవాలి అనిపించిందని కానీ అందరూ ఉండేసరికి అలా వెళ్లలేకపోయా అంటూ హారిక తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube