లాస్య ఆ టైప్ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ భార్య..  

amma rajasekhar wife sensational comments about lasya, amma rajasekhar,lasya, Bigg Boss Contestant, hero-Zero Task, Zero Gate, bigg Boss4 - Telugu Amma Rajasekhar, Amma Rajasekhar Wife, Amma Rajasekhar Wife Sensational Comments About Lasya, Bigg Boss 4, Bigg Boss Contestant, Bigg Boss4, Hero-zero Task, Lasya, Radha, Zero Gate

బుల్లితెర యాంకర్లలో ఒకరైన లాస్య ఈటీవీ, స్టార్ మా ఛానెళ్లలోని ప్రోగ్రామ్ ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా రవి లాస్య కలిసి చేసిన ప్రోగ్రామ్ లు బుల్లితెరపై సక్సెస్ అయ్యాయి.

TeluguStop.com - Amma Rajasekhar Wife Sensational Comments Lasya

సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ ద్వారా లాస్యకు పాపులారిటీ వచ్చింది.ప్రస్తుతం సుధీర్ రష్మీపై యూట్యూబ్ లో గాసిప్స్ ఏ విధంగా వైరల్ అవుతున్నాయో గతంలో రవి లాస్యపై అదే విధంగా వార్తలు అయ్యాయి.

అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిపై నెగిటివ్ కామెంట్లు చేసింది లాస్య.పెళ్లి తరువాత టీవీ షోలకు దూరంగా ఉంటున్న లాస్య యూట్యూబ్ ఛానల్ లాస్య టాక్స్ ద్వారా వీడియోలు అప్ లోడ్ చేస్తూ ప్రేక్షకులతో అనేక విషయాలను, విశేషాలను పంచుకుంటోంది.

TeluguStop.com - లాస్య ఆ టైప్ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ భార్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న లాస్య హౌస్ లో ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతూ కిచెన్ కే ఎక్కువగా పరిమితమవుతున్నారని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా లాస్యపై అమ్మ రాజశేఖర్ భార్య రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ షో రెండో వారంలో జరిగిన హీరో జీరో అనే టాస్క్ లో నాగార్జున జీరో అనుకున్న వాళ్లను జీరో అనే గేట్ నుంచి బయటకు తోయాలని చెప్పారు.మొదట దేవి నాగవల్లి రాజశేఖర్ మాస్టర్ ను తోసి “కామెడీ చేస్తే ఇక్కడ హీరోనా.?” అని వ్యాఖ్యలు చేసింది.ఆ తర్వాత లాస్య కూడా రాజశేఖర్ మాస్టర్ ను జీరో గేట్ నుంచి బయటకు పంపి “శృతి మించిన కామెడీని తాను యాక్సెప్ట్ చేయలేను” అని చెప్పింది.

ఆ మాటలకు రాజశేఖర్ మాస్టర్ చాలా బాధ పడ్డారు.తన భర్త తప్పు చేయకుండా శిక్ష వేస్తే చాలా బాధపడతారని.లాస్య రిజర్వ్డ్ టైప్ కాబట్టి అలా నింద వేసి ఉండవచ్చంటూ రాధ అన్నారు.నింద తట్టుకోలేకపోవడం వల్లే తన భర్త అంతలా ఏడ్చేశారని రాధ చెప్పారు.

#AmmaRajasekhar #AmmaRajasekhar #Bigg Boss 4 #Bigg Boss4 #Amma Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amma Rajasekhar Wife Sensational Comments Lasya Related Telugu News,Photos/Pics,Images..