అమ్మ మృతిపై పెద్ద కుట్ర‌..!?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబరు 5న గుండెపోటుతో మరణించిన ద‌గ్గ‌ర నుంచీ.త‌మిళ రాజ‌కీయాలు ఆమె మ‌ర‌ణం చుట్టూనే తిరుగుతున్నాయి! జయలలిత దాదాపు 70రోజులకు పైగా ఆసుపత్రిలో ఉన్నారు.

 Amma’s Death Mystery-TeluguStop.com

ఆ సమయంలో ఆమెకు అందించిన శ‌స్త్ర చికిత్స‌పై ప్ర‌జ‌ల్లో ఎన్నో సందేహాలున్నాయి.ఈ విషయంపై అపోలో డాక్టర్లు సందేహాలను నివృత్తి చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది.

అయినా స్పందించని వైద్యులు.జ‌య‌ నెచ్చెలి శశికళ సీఎంగా ఖరారైన సమయంలోనే, హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టేశారు! ప్రెస్‌మీట్‌లో డాక్టర్లు చెప్పిన విషయాలు సందేహాలకు క్లారిటీ ఇవ్వకపోగా మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి!

డాక్టర్లు చెప్పినదానికి, అక్కడ జరిగిన దానికి పొంతన లేదు.

ముఖ్యంగా డాక్టర్లు చెప్పిన విషయాల్లో జయలలిత వైద్య ఖర్చులకు సంబంధించిన అంశం చర్చనీయాంశమైంది.జయలలిత మెడికల్ బిల్లు 5.5 కోట్లు‌గా డాక్టర్లు చెప్పారు.ఆ బిల్లును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు.

అయితే ఆసుపత్రిలో శశికళ తప్ప జయ కుటుంబ సభ్యులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు.మరి అలాంటప్పుడు ఆ బిల్లు కుటుంబ సభ్యులకు ఎలా ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది.

అలాగే గవర్నర్ విద్యాసాగర్ రావుకు అపోలోకు వెళ్లినప్పుడు ఆమె కోలుకుంటున్నట్టు విజయ సంకేతం చూపారని డాక్టర్లు తెలిపారు.

ఆ సమయంలో గవర్నర్ అపోలోకు వెళ్లిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.

తనను లోపలికి అనుమతించలేదని చెప్పారు.మ‌రి జ‌య ఎవ‌రికి సంకేతం చూపారో వైద్యులే చెప్పాలి! ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చికిత్స జరుగుతున్న ప్పుడు కనీసం ఒక ఫోటోనైనా బయటకు విడుదల చేయాల్సిన కనీస బాధ్యత ఆసుపత్రి యాజమాన్యంపై ఉంది.

అలా లేని ప‌క్షంలో ఆమె చనిపోయిన అనంతరమైనా వైద్యం జరిగిన తీరును వివరిస్తూ సీసీ పుటేజీలను బయటపెడితే వచ్చే నష్టమేంటనేది అంతుచిక్కని ప్రశ్నే.ప్రెస్‌మీట్ పెట్టి అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పే బదులు సీసీ పుటేజిలను మీడియాకు చూపిస్తే సందేహాలుండ‌వు! మరి డాక్టర్లు అలా ఎందుకు చేయలేదనేది మరో ప్రశ్న.

శశికళపై ఎలాంటి మచ్చ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అపోలో డాక్టర్లతో ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయించిందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.శశికళను తప్ప ఆసుపత్రిలోకి కనీసం జయలలిత సొంత మనుషులను కూడా రానివ్వకపోవడంపైనే అన్ని అనుమానాలు.

తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు రాకూడదనే ఉద్దేశంతోనే శశికళ ఈ ప్రెస్‌మీట్ డ్రామాను నడిపించిదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube