కార్తీకమాసంలో ఉసిరి ఉపయోగం ఇదే

కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం.వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి.

 Amla Advantages In Kaarteekamaasam, Karthika Masam , Amla , Vanabhojanalu , Vita-TeluguStop.com

కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు.ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు.

పూర్వీకులు ఏమి చేసినా దానిలో ఒక పరమార్ధం నిగూడంగా దాగి ఉంటుంది.వారి ప్రతీ ఆచార నియమం మన ఆరోగ్యానికి మన పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటుంది.

అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.

కార్తీకమాసం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఉదయాన్నే కురిసే పొగమంచు.

ఇలా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.కానీ కఫ సంభందించిన వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం కార్తీకమాసం రాగానే బయపడి పోతుంటారు.

ఆయాసం వలన వారు ఊపిరిని పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవడం మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాం.ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి.

తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం.ఉసిరిలోని విటమిన్‌ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి.

వన భోజనాలు అంటే గుర్తొచ్చేది ఉసిరి ముందుగా ఉసిరి చెట్టుకి పూజ చేసిన తరువాతనే ఎటువంటి పని అయినా మొదలు పెడుతారు ఈసమయంలో .ఉసిరి చెట్టుకింద భోజనం చేస్తే చాల మంచిది అనేది సంప్రదాయంగా వస్తూనే ఉంది.ఉసిరికి ఉన్న మరొక ప్రత్యేకమైన గుణం ఏమిటి అంటే.వృద్ధాప్య చాయల్ని తొందరగా దరిచేరనివ్వదు.ఇది మాములుగా చెప్పిన విషయం కాదు చరకుడు.అంటే ఆయుర్వేద పితామహుడు సైతం తన చరక సూత్రంలో పొందుపరిచిన అంశం ఇది ఆయుర్వేదంలో ఉసిరే కీలకమైనది.

కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ.ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే.

అనేకానేక రోగాల నియంత్రణకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం ఉసిరి మొక్క.అందుకే ఉసిరిని సర్వరోగ నివారిణి అని పిలుస్తారు.

శీతాకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు.ఎండబెట్టిన ఉసిరి గింజలు కొబ్బరి నూనె మిశ్రమంలో కలుపుకుని తలకి రాసుకుంటే జుట్టు చాలా బలంగా ఉంటుంది.

ఈ కార్తీకమాస కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధులని నివారించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Amla Advantages In Kaarteekamaasam, Karthika Masam , Amla , Vanabhojanalu , Vitamin C , Anti Acident , Winter , Health Benifits , Health Tips , Good Health - Telugu Amla, Benifits, Tips, Karthika Masam, Vanabhojanalu, Vitamin

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube