'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్ లాంచ్ కు ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు.ఈయన విభిన్న సినిమాలతో టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 'amj' Trailer Launch To Feature Sai Pallavi, Keerthy Suresh, Keerthy Suresh, Sai-TeluguStop.com

హిట్లు ప్లాప్స్ తో సంభంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నాడు.శర్వా శతమానం భవతి సినిమా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

చాలా రోజుల నుండి హిట్ లేక బాధ పడుతున్న అతడు ఇప్పుడు చేస్తున్న సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు.

ప్రస్తుతం శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు‘ సినిమా చేస్తున్నాడు.

ఇందులో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది ఆడవాళ్ళ గురించే తెరకెక్కుతున్న సినిమా.ఈ సినిమా మార్చి 4న రిలీజ్ కాబోతుంది.

అసలు ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా భీమ్లా నాయక్ కారణంగా శర్వా వెనక్కి తగ్గాడు.ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో విడుదల చేయబోతున్నారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరవుతారని మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు.ట్రైలర్ లాంచ్ కు ఇద్దరు నటీ మణులనే ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం వెనుక సినిమా థీమ్ కారణం అని చెబుతున్నారు.

ఎందుకంటే ఈ సినిమా ఆడవాళ్ళ గొప్పతనాన్ని చిత్రీకరిస్తుంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ నటిస్తున్నారు.ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.కీర్తి సురేష్, సాయి పల్లవి కు ఉన్న ప్రతిభ కారణంగానే వీరిద్దరిని ఎంచుకున్నట్టు వెల్లడించడం వారికీ నిజంగా గౌరవం దక్కడమే.

AMJ Trailer Launch To Feature Sai Pallavi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube