నరకం చూస్తున్న అమితాబ్‌.. ట్విట్టర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబచ్చన్‌ ప్రస్తుతం కరోనాతో పోరాటం సాగిస్తున్న విషయం తెల్సిందే.

ఆయన మూడు వారాలుగా కరోనాతో బాధపడుతున్నారు.ముంబయి నానావతి ఆసుపత్రిలో బచ్చన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు.

ఇప్పటికే పలు సార్లు పరీక్ష చేసినా కూడా ఆయనకు పాజిటివ్‌ వస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

కరోనాకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్న వైధ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.సిస్టర్స్‌ కూడా కనీసం దగ్గరకు రావడం లేదు.

అమితాబ్‌ విషయంలో కూడా అదే జరుగుతుందట.అమితాబచ్చన్‌ తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

రోజంతా ఒంటరిగా ఉండటంతో పాటు వైధ్యులు మరియు నర్స్‌ వచ్చినా వారు పూర్తిగా పీపీఈ కిట్స్‌ ధరించి ఉంటున్నారు.

కనీసం వారి మొహ కవలికలు కూడా కనిపించడం లేదన్నాడు.వారు కొన్ని నిమిషాల్లోనే రూం నుండి వెళ్లి పోవాలని హరీబరీగా ఉంటున్నారు.

ఎక్కువ సమయం ఉంటే కరోనా తమకు ఎక్కడ అంటుతుందో అనే భయం వారిది.

ఇక డాక్టర్‌ వీడియో కాల్‌ ద్వారా సలహాలు ఇస్తున్నారు.ఈ సమయంలో ఇలా ఉండటమే మంచిది.

కాని ఇలా ఉండటం వల్ల మనిషి మానసికంగా చాలా బాధపడతారంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఈ సమయంలో తాను చాలా మానసిక సంక్షోభంకు గురి అవుతున్నట్లుగా పేర్కొన్నాడు.

కరోనా అనేది ప్రాణాంతం కాదు.కాని కాస్త వయసు ఎక్కువ ఉన్న వారు మరియు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు కరోనా నుండి కోలుకోవడంకు సమయం పడుతుంది.

అమితాబ్‌ కూడా త్వరలోనే కోలుకుంటాడని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హనుమాన్, శని దేవుడికి మధ్య వైరం ఎందుకు జరిగిందో తెలుసా..?