బిగ్‌బి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు.. డాక్టర్ల స్పందన  

Doctors Give The Clarity About Big B Health Condition , Amithab Bachan, Abhishek Bachan, Iswarya Rai, Aradhya, Isolation, Nanavathi Hospital, Coronavirus, Bollywood - Telugu Abhishek Bachan, Amithab Bachan, Aradhya, Bollywood, Coronavirus, Isolation, Iswarya Rai, Nanavathi Hospital

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆయన్ను ముంబయిలోని నానవతి హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆయనతో పాటు ఆయన కొడుకు అభిషేక్‌ బచ్చన్‌ కూడా కరోనా నిర్థారణ అవ్వడంతో ప్రస్తుతం ఆయన్ను కూడా ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచారు.

 Amithab Bachan Health Coronvirus Doctors

అయితే ఐశ్వర్య రాయ్‌ ఇంకా ఆద్యలకు కరోనా పాజిటివ్‌ వచ్చినా ఇంట్లోనే ఉంచి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు.ఈ సమయంలోనే అమితాబచ్చన్‌ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఎనిమిది పదుల వయసు కలిగిన అమితాబచ్చన్‌ కరోనాను జయిస్తే అద్బుతంగా అంటున్నారు.పలువురు వృద్దులు కరోనా కారణంగా మృతి చెందుతున్నారు.ఆ విషయమే ఇప్పుడు ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.పైగా కొందరు సోషల్‌ మీడియాలో బిగ్‌బి ఆరోగ్య పరిస్థితిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తూ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నారు.

బిగ్‌బి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు.. డాక్టర్ల స్పందన-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఒక పోస్ట్‌ అందరికి షాకింగ్‌ గా మారింది.

అమితాబచ్చన్‌కు శ్వాస ఆడటం లేదని ఆయన శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వెంటిలేషన్‌ ద్వారా అమితాచ్చన్‌కు శ్వాసను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.అమితాబచ్చన్‌ గతంలోనే కొన్ని అనారోగ్య సమస్యలు కలిగి ఉన్న కారణంగా కరోనా ఆయన్ను మరింత ఇబ్బంది పెడుతుందనేది ఆ ట్వీట్‌ సారాంశం.అయితే ఆ విషయాన్ని వైధ్యులు కొట్టి పారేశారు.

అమితాబ్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.సాదారణంగానే శ్వాసను అందిస్తున్నాం.

ఆయన పరిస్థితి ప్రమాదకరంగా అయితే లేదని పేర్కొన్నారు.బచ్చన్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కూడా చాలా సేఫ్‌ గా ఉన్నారని వైధ్యులు దృవీకరించారు.

#Coronavirus #Iswarya Rai #Aradhya #Amithab Bachan #Isolation

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amithab Bachan Health Coronvirus Doctors Related Telugu News,Photos/Pics,Images..