కరోనాను జయించిన బిగ్ బీ..!  

Amithab Bachan, corona negative, abhishek bachchan, aishwarya rai bachchan, aaradhya, - Telugu Aaradhya, Abhishek Bachchan, Aishwarya Rai Bachchan, Amithab Bachan, Corona Negative

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.అమితాబ్ కు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్టర్ లో వెల్లడించారు.

TeluguStop.com - Amithab Bachan Corona Negative Abhishek Bachchan

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నాన్నకు కరోనా నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

TeluguStop.com - కరోనాను జయించిన బిగ్ బీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తన తండ్రి కోలుకోవాలని ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.

అయితే తాను కరోనా నుంచి కోలుకోలేదని అభిషేక్ బచ్చన్ మరో ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు, తనకు మరోసారి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని ట్వీట్ చేశారు.

తన కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు.కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను ప్రామిస్ అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్టర్ లో వెల్లడించారు.

జూలై 11వ తేదీన బచ్చన్ ఫ్యామిలీలో మొదట అమితాబ్‎కు కరోనా పాజిటివ్ వచ్చింది.అనంతరం అభిషేక్ బచ్చన్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతో వీరిద్దరూ ముంబయి లోని నానావతి ఆస్పత్రిలో చేరారు.వీరిద్దరికి పాజిటివ్ రావడంతో బచ్చన్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ టెస్టుల్లో అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలింది.ఇక జయా బచ్చన్ కు, వీరితో పాటు ఉంటున్న కుమార్తె కుటుంబానికి నెగిటివ్ వచ్చింది.

వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య.జూలై 17వ తేదీన నానావతి ఆస్పత్రిలో చేరారు.

కరోనా నెగిటివ్ రావడంతో జూలై 27న వీరిద్దరూ డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

#Corona Negative #Aaradhya #Amithab Bachan #AishwaryaRai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amithab Bachan Corona Negative Abhishek Bachchan Related Telugu News,Photos/Pics,Images..