కొనసాగుతున్న వారసత్వం,త్వరలో తెరంగేట్రం చేయనున్న మరో వారసుడు!  

Big b Amitab grandson ready to debut in films , Big B, Amithab Bachan, Agastya Nandha, Amithab Bachan Daughter Swetha Nandha, Abhishek Bachan, Iswarya Rai, Sushanth Singh Raj Puth - Telugu Abhishek Bachan, Agastya Nandha, Amithab Bachan, Amithab Bachan Daughter Swetha Nandha, Big B, Iswarya Rai, Sushanth Singh Raj Puth

బాలీవుడ్ లో నెపోటిజం పై విమర్సలు వస్తున్న సమయంలో తాజాగా మరో నటవారసుడు ఇండస్ట్రీ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే బిగ్ బీ అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరో గా పరిచయం కానున్నట్లు తెలుస్తుంది.

 Amithab Bachan Agashtya Nandha Abhishek Bachan

ఇప్పటికే యువ హీరో సుశాంత్ ఆత్మహత్య ఉదంతం అనంతరం బాలీవుడ్ లో నెపోటిజం అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో ఇప్పుడు బిగ్ బీ మనవడు త్వరలో తెరంగేట్రం చేయనుండడం చర్చనీయాంశమైంది.

వాస్తవానికి అమితాబ్ కుటుంబం చూసుకుంటే దాదాపు అందరూ కూడా ఇండస్ట్రీ లో నటులుగా రాణించిన వారే.

కొనసాగుతున్న వారసత్వం,త్వరలో తెరంగేట్రం చేయనున్న మరో వారసుడు-Movie-Telugu Tollywood Photo Image

అమితాబ్ సతీమణి,జయా బచ్చన్ కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చాలా సినిమా లు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.అలానే అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ధూమ్ వంటి పలు హిట్ మూవీ లతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆయన సతీమణి ఐశ్వర్య రాయ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఇటు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు తాజాగా అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త్య నందా ను త్వరలో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నట్లు తెలుస్తుంది.చిన్నప్పటి నుంచి కూడా సినిమాలపై ఎక్కువ మక్కువ చూపే అగస్త్య కు నటన పై ఎంతో ఆసక్తి ఉందని అందుకే త్వరలో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలీవుడ్ ను కుదిపేసింది.

ఇండస్ట్రీ లో నెపోటిజం ఉందని,వారసుల కు తప్పించి మిగిలిన వారికి అవకాశాలు లభించవు అని అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖుల పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో మరో వారసుడు తెరంగేట్రం చేయనుండడం చర్చనీయాంశమైంది.అయితే మరోవైపు అసలు ఏ చిత్రం తో, ఎవరి దర్శకత్వం లో అగస్త్య ఇండస్ట్రీ లో అడుగుపెట్టనున్నాడు అన్న వివరాలు మాత్రం వెల్లడికాలేదు

.

#Abhishek Bachan #Amithab Bachan #Big B #Agastya Nandha #Iswarya Rai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amithab Bachan Agashtya Nandha Abhishek Bachan Related Telugu News,Photos/Pics,Images..