అభిషేక్‌ బచ్చన్‌ తాజా ఆరోగ్య పరిస్థితి బులిటెన్‌  

Abihishek Bachan Health Update, Amithab Bachan, Abhishek Bachan, Mumbai Nanavathi Hospital, Coronavirus, Abhishek Bachan Corona Positive, Immunity Power - Telugu Abhishek Bachan, Abhishek Bachan Corona Positive, Amithab Bachan, Coronavirus, Immunity Power, Mumbai Nanavathi Hospital

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ గత నెలలో కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.అయితూ మూడు వారాల్లో ఆయన కరోనాను జయించాడు.

 Amithab Bachan Abhishek Bachan Mumbai Nanavathi Hospital Coronavirus

ఇటీవలే ఆయనకు కరోనా పరీక్షలో నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.దాంతో ప్రస్తుతం ఆయన సాదారణ వార్డ్‌కు తరలించబడ్డాడు.

ఇదే సమయంలో ఆయన తనయుడి గురించిన చర్చ మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్‌ బచ్చన్‌కు మరోసారి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

అభిషేక్‌ బచ్చన్‌ తాజా ఆరోగ్య పరిస్థితి బులిటెన్‌-Movie-Telugu Tollywood Photo Image

వయసులో చాలా పెద్ద వారు అయిన అమితాబచ్చన్‌ పాటించే ఆరోగ్య జాగ్రత్తలు మరియు ప్రతి రోజు ఆయన చేసే వర్కౌట్స్‌ మరియు తీసుకునే ఆహారపు అలవాట్ల కారణంగా ఆయన కరోనాను ఈజీగానే జయించాడు అంటున్నారు వైధ్యులు.అమితాబ్‌ బచ్చన్‌లో ఉన్న ఇమ్యూనిటీ స్థాయి అభిషేక్‌ బచ్చన్‌లో లేదని ఆ కారణంగానే ఆయన కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వైధ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఆయన శ్వాస సంబంధించిన సమస్య అయితే ఏమీ లేదు.కాని ఇమ్యూనిటీ ఇంకా తక్కువగా ఉండటం వల్ల కరోనా పాజిటివ్‌ అంటూనే రిపోర్ట్‌ వస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌ ముంబయిలోనే ప్రముఖ ఆసుపత్రి అయిన నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.తండ్రి బాటలోనే మరో వారం రోజుల్లోనే అభిషేక్‌ బచ్చన్‌ కూడా నెగటివ్‌ రిపోర్ట్‌తో ఇంటికి వెళ్తాడనే నమ్మకంను వైధ్యులు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పెద్దగా ట్రీట్‌మెంట్‌ ఏమీ ఇవ్వకుండా ఆయన్ను పరిశీలనలో ఉంచారు.ఆసుపత్రిలోనే ఉన్న ఆయన మెడిటేషన్‌ యోగా చేయడంతో పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాల వారు ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో చెప్పుకొచ్చారు.

#AbhishekBachan #MumbaiNanavathi #Immunity Power #Coronavirus #Amithab Bachan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amithab Bachan Abhishek Bachan Mumbai Nanavathi Hospital Coronavirus Related Telugu News,Photos/Pics,Images..