జగన్ కి ఢిల్లీ పిలుపు ? ఆ ఫిర్యాదే కారణమా ?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆకస్మాత్తుగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడం వసీసీపీలో కలకలం రేపుతోంది.వీలైనంత తొందరగా ఢిల్లీకి రావాలని ఆ ఫోన్ సారాంశం.

 Amith Shaw Call To Jagan Mohan Reddy-TeluguStop.com

రాజధాని వ్యవహారంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జగన్ మూడు రాజధానులు అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.దీనిపై హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం రాజధాని తరలింపు పై ప్రజలను ఒప్పించి తగిన నిర్ణయం తీసుకుంటామని జగన్ ప్రకటించారు.

అయినా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన విరమించలేదు.పది రోజులుగా వారు చేస్తున్న ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉండడం, దీనికి ఏపీ బీజేపీ నేతలు కొంతమంది మద్దతు పలకడం జరిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న జగన్ కు బీజేపీ చీఫ్ అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది.జగన్ కు అమిత్ షా ఫోన్ చేసి పిలవడానికి ఏపీ రాజధాని తరలింపు వ్యవహారమే కారణం అని వార్తలు వస్తున్నాయి.

Telugu Amith Shaw, Amithshaw, Apcm-Telugu Political News

ఇటీవల రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ హిందూ మహాసభ చైర్మన్ చక్రపాణి మహారాజ్ అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అమరావతి ప్రాంతంలో అమాయక రైతులపై, హిందు సంస్కృతి పై, దాడులు జరుగుతున్నాయంటూ చక్రపాణి మహారాజ్ ఫిర్యాదు చేశారు.అలాగే ఏపీలో ఎక్కువగా మాత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలంటూ ఆయన కోరారు.ఈ నేపథ్యంలో జగన్ కు ఫోన్ కాల్ రావడం ఆసక్తి నెలకొంది.

అంతకు ముందే జగన్ కూడా ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, ప్రధాని మోదీని కలిసి రాజధాని వ్యవహారంపై తన అభిప్రాయాన్ని చెప్పి వారి మద్దతు తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నాడు.

Telugu Amith Shaw, Amithshaw, Apcm-Telugu Political News

అది కాకుండా రాజధాని వ్యవహారంలో ఏపీ బీజేపీ నేతలు వైసీపీకి వ్యతిరేకంగా, అమరావతి కి మద్దతుగా మాట్లాడుతున్నారు.సుజనా చౌదరి వంటి నాయకులు వైసీపీని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల అభిప్రాయం ఏమిటో స్పష్టంగా తెలుసుకుని వారికి మూడు రాజధాని ఏర్పాటుపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని చూస్తున్న సమయంలోనే కేంద్రం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది.

అయితే జగన్ పర్యటన ఈ వారంలోనే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube