కమలంతో ఆయన ప్రయాణం ..?... కూటమి కో 'దండం'  

తెలంగాణ లో ఎన్నికల పొత్తులు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతూ … ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తోంది. మొదట టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసాయి. ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా తాయారు చేసుకున్నారు. అయితే సీట్ల పంపకాల విషయం దగ్గరకు వచ్చేసరికి పార్టీల పేచీలు మొదలయ్యాయి...

కమలంతో ఆయన ప్రయాణం ..?... కూటమి కో 'దండం' -

తాము అడిగినన్ని స్థానాలు… అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందే అంటూ … మహా కూటమిలోని పార్టీలన్నీ మొండిపట్టు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీజేఎస్ తరపున కోదండరాం సీట్ల విషయంలో డెడ్ లైన్ కూడా పెట్టేసాడు. ఇక ఆయన కూటమిలోకి వెళ్ళేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితులన్నీ గమనిస్తున్న బీజేపీ ఆయన్ను చేరదీసేందుకు ప్రయత్నిస్తోంది.

మహా కూటమి నుంచి కోదండరాంని బయటకు తీసుకురావాలనే తెరవెనక అజెండాతో అమిత్ షా ముందుకు వెళ్తున్నారనేది స్పష్టమవుతోంది. ఉద్యమ సమయంలో ప్రాణాలర్పించినవారి కుటుంబ సభ్యులు, ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వారు, యువకులు, విద్యార్థులు. ఇలా ఓ వర్గంలో టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి ఉంది.

ఆ అసంతృప్త వర్గమంతా పరోక్షంగా టీజేఎస్ పక్షాన నిలబడుతోంది. కాబట్టి ఈ ఓట్లను కొల్లగొట్టాలంటే కోదండరాం కావాల్సిందే అన్న అంచనాకి బీజేపీ వచ్చింది. .

కూటమి నుంచి కోదండరాం బయటకి రాగానే ఆయన్ను ఎలా అయినా ఒప్పించి బీజేపీతో కలసి పనిచేసేలా వ్యూహం రచిస్తున్నారు అమిత్ షా. ఇక కాంగ్రెస్ బేరసారాలతో విసుగెత్తిపోయిన కోదండరాం, టీడీపీతో చేతులు కలిపి తెలంగాణ ద్రోహులతో కలిశాడన్న అపవాదుని తలకెత్తుకోవడం ఇష్టంలేని కోదండరాం.

ఎలాగోలా నెపం మహాకూటమిపైనే నెట్టి బయటకు వచ్చేయడానికి డెడ్ లైన్ పెట్టేసినట్టు తెలుస్తోంది. బీజేపీ – టీజేఎస్ కొత్త కూటమి తెలంగాణ ఎన్నికల్లో తెరపైకి రావడం దాదాపు ఖాయం. టీజేఎస్ ని కలుపుకొని వెళ్లడానికి బీజేపీ స్థానిక నాయకత్వం కూడా సుముఖంగానే ఉంది...