లాక్ డౌన్ పై క్లారిటీ లేని కేంద్రం ? సీఎం లకు ఫోన్లు ?

లాక్ డౌన్ పొడిగింపు, ముగింపు, సడలింపులు విషయంలో కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది.ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం, ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 Central Governament Make A Phone Calls All States Cm's About Lock Down Extension-TeluguStop.com

మొదటి, రెండో విడత లాక్ డౌన్ కఠినంగా అమలు చేసినా, మూడు, నాలుగో విడత లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో పరిస్థితి అదుపు తప్పినట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది.ఈ సడలింపులు ఇవ్వడం వెనుక అన్ని రాష్ట్రాల ఒత్తిడి కేంద్రం పై తీవ్రంగా ఉంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, దివాళా తీసే పరిస్థితి రావడంతో సడలింపు ఇవ్వవలసిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చాయి.ఇదే సమయంలో వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోవడం, ఆకలి బాధలతోనే తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వేల కిలోమీటర్లు నడక బాట పట్టడం, ఈ సందర్భంగా కొంతమంది మార్గమధ్యంలోనే చనిపోవడం, ఈ విషయంపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఫోకస్ అవ్వడం, వంటి పరిణామాలతో ఆందోళన చెందిన కేంద్రం సడలింపులు ఇచ్చింది.

అలాగే వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల వారందరిని తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.ఇది అంతా సజావుగా సాగుతోంది అనుకున్న సమయంలోనే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి కారణంగా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

అలా అని నిబంధనలు కఠినంగా అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఇంత ఘోరంగా దెబ్బతింటుంది.ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న విషయంలో కేంద్రానికి కూడా సరైన క్లారిటీ లేకుండా పోయింది.

లాక్ డౌన్ గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించాలా.? వద్దా అనే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం.

Telugu Cms, Financial, Amith Shah, Coronavirus, Wage, Lock-Political

ఈ సందర్భంగా గా లాక్ డౌన్ పొడిగింపు చేస్తే ఏ ఏ రంగాలకు మినహాయింపు ఇవ్వాలి ? ఇంకా ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తీసుకున్నట్లు తెలుస్తోంది .మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగింపు చేస్తేనే మంచి అన్నట్లుగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారట.కాకపోతే ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube