ఏపీ లో గెలుద్ధాం ! అమిత్ షా ప్లాన్ ఇలా ?

సూటిగా చెప్పాలంటే కేంద్రంలో బిజెపి చాలా తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది.మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమైన పని అనే విషయం బిజెపి పెద్దలందరికీ అర్థమైంది.

 Amith Sha Focused On Ap Politics Ap, Telangana, Bjp, Congress, Ysrcp, Tdp, Ap Cm-TeluguStop.com

బలహీనంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ బాగా బలం పుంజుకోవడం, ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలోకి రావడం, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలు సామాన్యుడికి అందనంత దూరంలో ఉండడంతో, ఆ వ్యతిరేకత అంతా బీజేపీ కొంప ముంచేలా ఉండడంతో గెలుపు పై భయాందోళన లు నెలకొన్నాయి.ఇంకా ఎంతో అపకీర్తి బిజెపి మూట కట్టుకోవాల్సి వస్తుంది.

ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హామీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న తీరుకు జనాల్లో తీవ్ర అసంతృప్తి మొదలయ్యింది.

ఈ క్రమంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టమైన పని అని వివిధ సర్వేలు తేల్చడంతో, ఇప్పటి నుంచే కేంద్ర బిజెపి పెద్దలు అలర్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

తమకు పూర్తిగా బలం ఉన్న రాష్ట్రాలను పక్కనపెట్టి, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ పుంజుకునేలా చేసి, ఎన్నో కొన్ని సీట్లు సంపాదించగలిగితే, రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఉండవు అనే ఆలోచనతో కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నారు.ఇప్పటికే తెలంగాణలో పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడడంతో ఏపీ పైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తున్నారు.

ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకంగా వ్యవహరించబోతున్నారట.

Telugu Amith Sha, Ap Cm Jaga, Bjp Central, Central, Congress, Telangana, Ysrcp-T

ప్రస్తుతం టిడిపి, వైసిపిలతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్న బీజేపీ పెద్దలు, ఈ రెండు పార్టీలు పూర్తిగా బలం పుంజుకుంటే తమకు ఏపీలో అధికారం దక్కుతుందనే అభిప్రాయం లో ఉన్నారట.వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా, అది తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుందనే ఆలోచనతో ఉన్నారట.అందుకే సొంతంగానే బీజేపీకి బలం పెరిగే విధంగా త్వరలోనే ఏపీలో కేంద్ర బిజెపి పెద్దలు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Telugu Amith Sha, Ap Cm Jaga, Bjp Central, Central, Congress, Telangana, Ysrcp-T

ముఖ్యంగా అమిత్ షా ఏపీలో రెండు భారీ బహిరంగ సభలు సభల్లో పాల్గొనాలి అనే ఆలోచనలో ఉన్నారట.గోదావరి జిల్లాలో ఒకటి, రాయలసీమ ప్రాంతంలో మరో సభను నిర్వహించి బిజెపి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట.ఇక వరుసగా ఇదే రకమైన సమావేశాలు నిర్వహించడం తో పాటు, ఏపీ బీజేపీ నేతలతో అవసరమైతే పాదయాత్ర చేయించేందుకు బిజెపి పెద్దలు సిద్ధం అవుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube