జగన్ కు బీజేపీ వార్నింగ్ ? హోదా అన్నారో మాములుగా ఉండదు  

Bjp Warns About To Ys Jagan About Ap Special Status - Telugu Ap Special Status, Bjp, Chandrababu Naidu, Lokesh, Modi, Roja, Tdp, Ys Jagan, Ysrcp, జగన్ బీజేపీ

బిజెపి ప్రభుత్వం జగన్ కు అన్ని రకాలుగా సహకరిస్తోందని, ఒకరకంగా జగన్ ను అన్ని రకాలుగా వెనకుండి నడిపిస్తోందని, మూడు రాజధాని వ్యవహారంలో కేంద్ర వైకిరిని బట్టి అందరికీ అర్థమైపోయింది.అయితే ఇదే అదనుగా జగన్ ప్రధానమంత్రి మోదీ కి ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై ఘాటుగా లేఖ రాయడం, ఆర్థిక సంఘం కూడా కేంద్రం అనుమతి ఇస్తే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అభ్యంతరం లేదంటూ చెప్పడం, వాటికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగాయి.

Bjp Warns About To Ys Jagan About Ap Special Status

ఆ లేఖపై బిజెపి జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే రాజకీయంగా జగన్ ఇబ్బంది పడతారు అంటూ వార్నింగ్ ఇస్తోంది.

అదీ కాకుండా జగన్ ని ఉద్దేశించి రాసిన లేఖ మీడియాలో వైరల్ అవ్వడం, దీని కారణంగా బిజెపి చిక్కుల్లో పడడం తదితర పరిణామాలపై బిజెపి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది.గత తెలుగుదేశం ప్రభుత్వంలో తమపై నిందలు వేయాలని చూస్తే ఊరుకునేది లేదు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా హెచ్చరించారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని జగన్ కు బాగా తెలుసునని,అయినా ఆయన కేంద్రాన్ని బెదిరిస్తూ లేఖలు రాస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.అసలు ప్రత్యేక హోదా విషయంలో మరో ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని, అదే సమయంలో రాజధానులు మార్చుకుంటే తగిన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు.

0రాజధానిని నోటిఫై చేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం ఏమీ కాదని, అవసరమైతే జగన్ జీవో ఇస్తే మళ్లీ కేంద్రం నోటిఫై చేస్తుంది అంటూ చెప్పారు.బిజెపి వ్యవహారం చూస్తుంటే మూడు రాజధానిలో వ్యవహారంలో తాము మద్దతు ఇస్తున్నాం కాబట్టి, ఇక ప్రత్యేక హోదా అంశం గురించి జగన్ మాట్లాడకపోతే మంచిది అన్నట్లుగా ఆ పార్టీ భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది.దీనిపై వైసీపీ ఏవిధంగా స్పందించాలి అనే విషయంపై ఆలోచిస్తోంది.హోదా అంశాన్ని లేవనెత్తితే బిజెపి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు కోరి తెచ్చుకోవడం మంచిది కాదు అన్నట్లుగా వైసీపీలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ వ్యవహారంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.

తాజా వార్తలు