టాప్ హీరో కారు అమ్మకానికి పెడితే..కొనడానికి ఎవరూ ముందుకి రాలేదు.! ఎందుకో తెలుసా.?     2018-07-18   10:45:53  IST  Sai Mallula

సినిమా వాళ్ళ వస్తువులను వేలంపాటలో పెడితే అభిమానులు ఎంతలా ఎగబడి కొంటారో అందరికి తెలిసిందే. అందులోను టాప్ హీరో వాడింది అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఎగబడిపోతారు. అలాంటిది బిగ్ బి అమితాబ్ బచ్చన్ కార్ అమ్మడానికి పెడితే కొనేందుకు ఎవరూ ముందుకి రాలేదు. ఎందుకో తెలుసా.?

Amitabh Bachchan’s Range Rover For Less Than Rs 24 Lakh-

Amitabh Bachchan’s Range Rover For Less Than Rs 24 Lakh

ఆ అగ్రహీరోకి చెందిన కారు సెకెండ్ హ్యాండ్ మార్కెట్‌లో కొన్ని నెలలుగా దుమ్ముకొట్టుకుపోతూ పడివుంది. బ్రిటీష్ కంపెనీకి చెందిన లగ్గరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ వోగ్ అటోబయోగ్రఫీ కారును అమితాబ్ ఒకప్పుడు వాడేవారు. తరువాత దానిని అమ్మేశారు. ఇప్పుడు అదేకారు ముంబైలోని యూజ్డ్ మార్కెట్‌లో విక్రయానికి పెట్టారు.

ఈ కారును గతంలో అమితాబ్ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి, దాన్ని అమ్ముతున్నట్టు ఆన్ లైన్ లో ప్రకటన పెట్టారు. కండిషన్ లో ఉన్న కారు ధర రూ. 24 లక్షలుగా ఆయన నిర్ణయించారు. అయితే 13 ఏళ్ల క్రితంనాటి కారుకు ఇంత ఖరీదు వెచ్చించేందుకు ఎవరూ మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. దీనికితోడు ఇటువంటి కార్లను రూపొందించే సంస్థకూడా మూతపడింది. పైగా ఈ కారు పెట్రోలుతో నడుస్తుంది. దీంతో కారు నిర్వహణ కష్టమని చాలామంది భావిస్తున్నారు. అందుకే బిగ్ బీ కారు అమ్మడు పోవడం లేదని ఫైనల్‌గా తెలుస్తోంది. పైగా కారు స్పేర్ పార్ట్స్ లభ్యం కావని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.