కరోనా తగ్గిందని సంబరపడకండి.. అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం దేశం లో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే.రోజురోజుకు ఎన్నో కేసులు పెరుగుతున్నాయి.

 Amitabh Bachchans Key Comments On Covid 19 Amitabh Bachchan, Key Comments, Covid-TeluguStop.com

అంతేకాకుండా మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా లాక్‌ డౌన్‌ కూడా విధించారు.

దీనివల్ల కొంత వరకు వైరస్ ను తరిమి కొట్టవచ్చునని నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.ఇక కొంతవరకు కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఇక దీంతో ప్రజలు వైరస్ ప్రభావం తగ్గిందని ఇళ్లల్లో నుండి బయటికి వస్తున్నారు.దీనివల్ల వైరస్ ప్రభావం మరింత ఎక్కువవుతుందనే దృష్టిలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా తన ట్విట్టర్ వేదికగా ప్రజలకు కొన్ని విషయాలు పంచుకున్నాడు.

కోవిడ్ కేసులు కొన్ని ప్రాంతాలలో తగ్గాయని నిర్లక్ష్యం చేయకండి, నిబంధనలు పాటించండి అంటూ తెలిపారు.

Telugu @amitabhbachchan, Amitab, Bollywood, Coron Arules, Corona, Covid, Key, Di

ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితులు ఇంకా ఉన్నప్పటికీ కొన్ని దేశాలలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని దీంతో సంబరపడిపోకండి అని అంటున్నాడు బిగ్ బీ.ఈ సమయంలో అశ్రద్ధ వహించవద్దంటూ నిబంధనలు పాటించాలని, చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలని తెలిపాడు అమితాబ్ బచ్చన్.అంతేకాకుండా మాస్క్ లు దరించమని, వ్యక్తికి వ్యక్తికి మధ్య బౌతిక దూరం ఉండాలని తెలిపాడు.

Telugu @amitabhbachchan, Amitab, Bollywood, Coron Arules, Corona, Covid, Key, Di

ఇక అవసరం ఉంటే తప్ప అనవసరంగా ప్రయాణాలు చేయకూడదు అని కోరాడు.సమయాన్ని పాటించాలి అని, కరోనా ప్రభావం దరిచేరకుండా ఉండటానికి కోవిడ్ టీకాలను వేయించుకోవాలని తెలిపాడు.మొత్తానికి ప్రజలకు తన ట్విట్టర్ వేదికగా పలు జాగ్రత్తలు తెలిపిన అమితాబ్ ఇప్పటివరకు తన వంతు సహాయాన్ని అందించాడు.ఇక సంరక్షణ కేంద్రం లోని విరాళాలు అందజేయడానికి ప్రకటించారు.

దాదాపు రెండు కోట్ల విరాళాలను సంరక్షణ కేంద్రం లోని మిగతా ఏర్పాట్లకు అందజేశాడు.ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube