పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్! చనిపోయిన జవాన్ కుటుంబాలకి ఆర్ధిక సాయం!  

చనిపోయిన జవాన్ కుటుంబాలకి ఆర్ధిక సాయం అందించెందుకు ముందుకొచ్చిన అమితాబ్ బచ్చన్..

Amitabh Bachchan Will Be Donating 5 Lakhs To Each Family Of The 40 Martyrs-

కొంత మంది సెలబ్రిటీలు సినిమాలలోకే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోలు అనిపించుకుంటారు.దేశంలో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు మేమున్నాం అంటూ తమ వంతు ఆర్ధిక సాయం చేస్తూ ముందుకొస్తారు.అయితే ఇప్పుడు ప్రకృతి విపత్తు కోసం కాపోయిన దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తూ, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి అండగా నిలబడేందుకు ముందుకొస్తున్నారు..

Amitabh Bachchan Will Be Donating 5 Lakhs To Each Family Of The 40 Martyrs--Amitabh Bachchan Will Be Donating 5 Lakhs To Each Family Of The 40 Martyrs-

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలో వారి వంతుగా చనిపోయిన జవాన్ల కుటుంబాలకి తమ వంతుగా ఆర్ధిక సాయం చేస్తున్నారు.ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జవాన్స్ కుటుంబాలకి ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా చనిపోయిన సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి తనవంతు ఆర్ధిక సాయం ప్రకటించాడు.

ఇండియన్ ఆర్మీ తరుపున సేకరిస్తున్న ఫండ్స్ ద్వారా అమితాబచ్చన్ ఏకంగా రెండు కోట్ల ఎబ్భై లక్షల రూపాయిలు ఆర్ధిక సాయం అందించారు.ఈ విషయాన్నీ ఆయన అధికారికంగా తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా దృవీకరించారు.అమితాబ్ చేసిన ఆర్ధిక సాయం చూసిన చాలా మంది సెలబ్రిటీలు అతని గొప్ప మనసుని కొనియాడుతున్నారు.

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా అమితాబ్ బచ్చన్ చేసిన సహాయానికి సెల్యూట్ సర్ అంటూ అభినందించారు.మరి అమితాబ్ వరుసలో ఇంకెంత మంది సెలబ్రిటీలు జవాన్ కుటుంబాలకి ఆర్ధిక సాయం అందిస్తారో చూడాలి.