ఇండియన్ విమెన్ క్రికెట్ టీంని అందిస్తున్న క్రికెటర్లు... బిగ్ బి ఫన్నీ ట్వీట్  

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబచ్చన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.చాలా విషయాల మీద సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటారు.

TeluguStop.com - Amitabh Bachchan Tweet On Indian Cricketers

సోషల్ ఇష్యూల నుంచి సినిమాలు, క్రికెట్ గురించి అమితాబచ్చన్ స్పందిస్తూ ఉంటారు.ఒక్కోసారి ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకి ఆడపిల్ల పుట్టింది.ఈ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయడంతో పాటు తమ బిడ్డని కూడా పరిచయం చేశారు.

TeluguStop.com - ఇండియన్ విమెన్ క్రికెట్ టీంని అందిస్తున్న క్రికెటర్లు… బిగ్ బి ఫన్నీ ట్వీట్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో విరుష్క దంపతులకి క్రికెట్, సినీ ప్రముఖులు అందరూ విషెస్ చెప్పారు.ఇదిలా ఉంటే బిగ్ బి అమితాబచ్చన్ కూడా విరుష్క జంటపై ఆసక్తికరంగా పోస్ట్ చేశారు.

భార‌త క్రికెట‌ర్లంద‌రికీ అమ్మాయిలే పుడుతున్నారంటూ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆసక్తికరమైన ‌ ట్వీట్ చేశారు.

భార‌త మాజీ, ప్ర‌స్తుత‌ క్రికెట‌ర్లు రైనా, గంభీర్‌, రోహిత్ శ‌ర్మ‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేశ్ యాద‌వ్‌లంద‌రికీ కూతుళ్లే పుట్టార‌ని బిగ్ బీ పేర్కొన్నారు.

వీళ్లంతా భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తారా అని ట్వీట్ చేశారు.అందులో ధోనీ కూతురు కెప్టెన్‌గా ఉంటుందేమో అంటూ ఫన్నీగా ప్రశ్నించారు అమితాబచ్చన్ చేసిన ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా కామెంట్స్ చేయడం విశేషం.ఇదిలా ఉంటే అమితాబచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో మేడే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.అయితే అమితాబచ్చన్ ఫన్నీ ట్వీట్ పై టీమ్ ఇండియా క్రికెటర్లు మాత్రం ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.

.

#Anushka Sharma #Virat Kohli #Dhoni #TeamIndia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు