అమితాబచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..!  

Bollywood, Big B, Amitabh Bachchan,Corona Positive, Amitabh Tested Positive - Telugu Amitabh Bachchan, Amitabh Tested Positive, Big B, Bollywood, Corona Positive

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌ కరోనా బారిన పడ్డారు.దేశంలో ఇప్పటి వరకు లక్షల మంది కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.

 Amitabh Bachchan Tested Positive

సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా పలువురు కరోనాతో పోరాడుతున్నారు.అయితే అమితాబ్‌ వంటి స్టార్స్‌ మాత్రం కరోనా బారిన పడటం ఇదే ప్రథమం.

కరోనా బారిన పడ్డట్లుగా స్వయంగా అమితాబచ్చన్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.కరోనా పరీక్షలో నాకు పాజిటివ్‌ వచ్చిందని దాంతో నన్ను హాస్పిటల్‌కు తరలించారని అమితాబ్‌ అన్నారు.

అమితాబచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..-Movie-Telugu Tollywood Photo Image

నా కుటుంబ సభ్యులకు మరియు నా స్టాఫ్‌ కు పరీక్షలు నిర్వహించారు.అందుకు సంబంధించిన రిపోర్ట్‌ రావాల్సి ఉందని అమితాబచ్చన్‌ పేర్కొన్నాడు.అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదంటూ పేర్కొన్నాడు.అమితాబ్‌కు పాజిటివ్‌ అంటూ నిర్థారణ రావడంతో బాలీవుడ్‌ వర్గాల వారు నిర్ఘాంత పోతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు సైతం ఈ విషయమై ఆందోళనలో ఉన్నారు.

గడచిన పది రోజులుగా నన్ను కలిసిన వారు జాగ్రత్తగా ఉండండి అంటూ అమితాబచ్చన్‌ సూచించాడు.ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా టెస్ట్‌ చేయించుకోండి అంటూ సలహా ఇచ్చాడు.ప్రస్తుతం అమితాబచ్చన్‌ ముంబయిలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శ్వాస సంబంధించి ఎలాంటి సమస్యలు లేవన్నారు.

#Corona Positive #Big B

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Bachchan Tested Positive Related Telugu News,Photos/Pics,Images..