వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బి!

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా వైరస్ బారిన పడిన సంగతి విదితమే.దీంతో అమితాబ్ బచ్చన్ గత రెండు వారాలుగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

 Amitabh Bachchan, Strong Warning, Netizen, Twitter-TeluguStop.com

ఈ విషయం తెలిసిన సమయం నుండి దేశవ్యాప్తంగా అమితాబ్ అభిమానులు అంత అయన కోలుకోవాలని పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.

ఇంకా ఈ విషయం తెలుసుకున్న అమితాబ్ పూజలు, హోమాలు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే కరోనా వైరస్ తో అమితాబ్ బచ్చన్ చనిపోవాలని కొందరు ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేస్తున్నారు.ఇంకా ఈ విషయం బిగ్ బి దృష్టికి రావడంతో అయన తన బ్లాగ్ లో ఘాటుగా సమాధానం ఇచ్చారు.

”మిస్ట‌ర్ అజ్ఞాత వ్య‌క్తి.మీరు మీ తండ్రి పేరు రాయ‌లేదు.ఎందుకంటే మీ తండ్రి ఎవ‌రో మీకే తెలియ‌దు.నేనొక‌టి చెబుతున్నా.ఏవైన రెండు విష‌యాలు జ‌ర‌గొచ్చు.నేను చ‌నిపోతాను లేదా బ్ర‌తుకుతాను.

నేనొక వేళ చ‌నిపోతే సెల‌బ్రిటీపై దూష‌ణ‌కి దిగ‌లేరు.ఒక‌వేళ దేవుడి ద‌య వ‌ల‌న నేను బ్ర‌తికి ఉంటే నా నుండి మాత్ర‌మే కాకుండా 90 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ నుండి చాలా ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంది.

ఒకానొక రోజు దీని వ‌ల‌న నువ్వే ప‌శ్చాతాపం చెందుతావు” అమితాబ్ తీవ్రస్థాయిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు.దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube