సినిమాలకి స్వస్తి చెప్పే యోచనలో బిగ్ బి అమితాబ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఎదిగిన వ్యక్తి బిగ్ బి అమితాబచ్చన్, ఆజానుబాహువుగా, కంచు కంఠంతో తనదైన శైలిలో హీరోయిజం చూపిస్తూ సుదీర్ఘ ప్రస్తానంలో ఎవరికీ సాధ్యం కాని స్థాయికి బాలీవుడ్ లో ఎదిగి నెంబర్ వన్ హీరోగా నిలబడిపోయాడు.కమర్షియల్ సినిమాలు అంటే ఒకప్పుడు అమితాబచ్చన్ మాత్రమే దర్శకులకి గుర్తుకొచ్చేవారు.

 Amitabh Bachchan Says He Must Retire-TeluguStop.com

బాలీవుడ్ మెగాస్టార్ గా తన ప్రస్తానం సాగించిన అమితాబచ్చన్ తరువాత టర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ చూపించాడు.వృద్ధాప్యంలో కూడా తనకి సరిపోయే పాత్రలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ అతనిలో కళ చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది అనేలా నటనాప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలు కూడా అమితాబచ్చన్ చేస్తున్నాడు.అలా వచ్చిన వాటిలో సైరా కూడా ఒకటి.ప్రస్తుతం బిగ్ బి బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతుంది.

అక్కడికి వెళ్ళిన అమితాబ్ ఆసక్తికరమైన పోస్ట్ ని తన బ్లాగ్ లో పెట్టారు.నిర్మాణంలో ఉన్న రోడ్లు, కొన్ని మంచి రోడ్లు మీద 12 గంటల తర్వాత తన ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది.

ఇక నేను రిటైర్మెంట్ తీసుకోవాలేమో, ఎందుకంటే నా బుర్ర ఒకటి అలోచేస్తే నా చేతులు మరొకటి చేస్తున్నాయి.అని పెట్టారు.

ఈ పోస్ట్ చూసిన వారు బిగ్ బి ఇక సినిమాలకి స్వస్తి చెప్పేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు.అయితే ఆ విషయాన్ని అఫీషియల్ బిగ్ బి చెప్పేంత వరకు మాత్రం అందరూ వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube