బాలు మృతిపై స్పందించిన అమితాబ్.. విమర్శలకు చెక్?  

amitabh bachchan reacted on sp bala subrahmanyam death Sp Bala Subramanyam, Coronavirus, Amithab Bachan, Telugu And Tamilam And Hindhi Songs, Daughter Day, KBC, - Telugu Amithab Bachan, Coronavirus, Daughter Day, Kbc, Sp. Bala Subramanyam, Telugu And Tamilam And Hindhi Songs

ఎస్పీ బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది.ఇప్పటికీ బాలు అభిమానులు ఆయన చనిపోయాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

TeluguStop.com - Amitabh Bachchan Reacted On Sp Bala Subrahmanyam Death

సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.అంతర్జాతీయ మీడియా సైతం బాలు మరణం గురించి అనేక కథనాలను ప్రసారం చేసింది.

అయితే అందరూ స్పందించినా అమితాబ్ బచ్చన్ మాత్రం బాలు మృతి గురించి నిన్నటి వరకు స్పందించలేదు.

TeluguStop.com - బాలు మృతిపై స్పందించిన అమితాబ్.. విమర్శలకు చెక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎస్పీ బాలు తెలుగు, తమిళం, కన్నడ భాషలతో హిందీ సినిమాల్లో అనేక పాటలు పాడారు.16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడిన అరుదైన ఘనత ఎస్పీ బాలు సొంతం.అయినప్పటికీ అమితాబ్ బాలు మృతి గురించి స్పందించకపోవడానికి కారణం ఏమిటని సోషల్ మీడియా వేదికగా బాలు అభిమానులు ప్రశ్నించారు.

మరోవైపు సోషల్ మీడియాలో అమితాబ్ యాక్టివ్ గానే ఉన్నారు.శుద్ధ ఏకాదశి, డాటర్స్ డే, కౌన్ బనేగా కరోడ్ పతి షోకు సంబంధించిన పలు విషయాలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారని కామెంట్లు చేశారు.

దేశంలో ఏ ఘటన జరిగినా స్పందించడంలో అమితాబ్ ముందుంటారు.అలా అని బాలుకు, అమితాబ్ కు మధ్య విబేధాలు కూడా లేవు.

బాలుకు కరోనా నిర్ధారణ అయిన సమయంలో అమితాబ్ బాలు గురించి చాలా పోస్టులు పెట్టారు.అయితే ఆయన చనిపోయిన తరువాత మాత్రం అమితాబ్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదని విమర్శలు వ్యక్తం కాగా అమితాబ్ స్పందించి ఆ విమర్శలకు చెక్ పెట్టారు.

అమితాబ్ తన బ్లాగ్ లో కరోనా మహమ్మారి వల్ల ఒక రత్నాన్ని కోల్పోయామని.బాలు స్వరం దైవత్వంతో కూడిన స్వరం అని అన్నారు.చాలా సంవత్సరాల క్రితం ఎస్పీ బాలును ఒక కార్యక్రమంలో కలిశానని అమితాబ్ చెప్పుకొచ్చారు. సెలబ్రిటీ అయినప్పటికీ సామాన్యుడిలా ఉండటాన్ని బాలు ఇష్టపడతాడని అమితాబ్ అన్నారు.

#Amithab Bachan #TeluguAnd #SP.Bala #Daughter Day #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Bachchan Reacted On Sp Bala Subrahmanyam Death Related Telugu News,Photos/Pics,Images..