సైరాలో సాహిన్షా లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న అమితాబ్  

సైరాలో మెగా ఫ్యాన్స్ కి ఆసక్తి పెంచుతున్న అమితాబచ్చన్ లుక్. .

Amitabh Bachchan Look Very Exciting In Sara Movie-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి.మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అదే టైంలో సౌత్ ఇండియన్ స్టార్ కాస్టింగ్ తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ సినిమాలో నరసింహా రెడ్డికి గురువుగా కీలక పాత్రలో నటిస్తున్నారు..

Amitabh Bachchan Look Very Exciting In Sara Movie--Amitabh Bachchan Look Very Exciting In Sara Movie-

ఇక తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్, సైరా నరసింహా రెడ్డి సినిమాలో అమితాబచ్చన్ చేసిన పాత్ర లుక్ తో తాను దిగిన ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.మెగాస్టార్ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా చూసే మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు అమితాబచ్చన్ లుక్ విపరీతంగా నచ్చేసింది.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సైరాలో అమితాబచ్చన్ లుక్ ఇంత నేచురల్ గా ఉంటె మెగాస్టార్ లుక్ ఇంకెంత నేచురల్ గా ఉండబోతుందో అనే ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది.