మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి మరో వారసుడు ఎంట్రీ ప్లాన్‌ చేంజ్‌  

Amitabh Bachchan, Agastya, amitabh bachchan grandson agastya, agastya entry - Telugu Agastya, Agastya Entry, Amitabh Bachchan, Amitabh Bachchan Grandson Agastya

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మనవడు అగస్థ్య నందా హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అయ్యాడు.సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ను కలిగి ఉన్న అగస్థ్య ఈ ఏడాదిలో హీరోగా సినిమాను మొదలు పెట్టాలనుకున్నాడు.

 Amitabh Bachchan Grandson Agastya Entry

కాని ఈ సంవత్సరం పరిస్థితి అంత అతడికి రివర్స్‌ అయ్యింది.కరోనా కారణంగా షూటింగ్స్‌ జరగడం లేదు.

ఇదే సమయంలో సుశాంత్‌ మరణంతో నెపొటిజం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.దాంతో అగస్థ్య సినిమాకు కాస్త సమయం పట్టనుంది.

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి మరో వారసుడు ఎంట్రీ ప్లాన్‌ చేంజ్‌-Movie-Telugu Tollywood Photo Image

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించే అగస్థ్య తాజాగా తాతతో కలిసి ఉన్న ఒక ఫొటోతో సందడి చేశాడు.ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అన్ని వర్గాల వారిని ఆకర్షించే విధంగా అగస్థ్య లుక్‌ ఉంది.లవర్‌ బాయ్‌గా మొదట అగస్థ్య పరిచయం అవ్వాలనుకున్నాడు.

అంతా అలా అలా జరుగుతుంది అనుకుంటుండగా నెపొటిజం పై వస్తున్న విమర్శల కారణంగా అమితాబ్‌ ఫ్యామిలీ మరికొంత కాలం అగస్థ్య ఎంట్రీని ఆపాలని భావిస్తున్నారు.

ఈమద్య కాలంలో నెపొటిజంపై వస్తున్న విమర్శల కారణంగా స్టార్‌ వారసులతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు భయపడుతున్నారు.ఖచ్చితంగా ఇప్పట్లో సినిమా తీస్తే మాత్రం తీవ్రంగా ట్రోల్స్‌ చేయడంతో పాటు ఆ సినిమాలను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.అందుకే అగస్థ్య చిత్రంను వచ్చే ఏడాది చివరికి ప్రారంభించి ఆ తర్వాత ఏడాది విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

#Agastya Entry #Agastya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Bachchan Grandson Agastya Entry Related Telugu News,Photos/Pics,Images..