ప్రభాస్ సినిమా కోసం 40 రోజులు డేట్స్ ఇచ్చిన బిగ్ బి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కథతో భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజయంతీ మూవీస్ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 Amitabh Bachchan Given 40 Days Dates For Prabhas Movie, Tollywood, Bollywood, Te-TeluguStop.com

ఈ ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోకి మరో స్టార్ నటుడు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ వచ్చి చేరాడు.

ఈ సినిమాలో ఈ కీలక పాత్రలో అతను కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఒక వీడియో ద్వారా తెలియజేసింది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది అని సమాచారం.

హాలీవుడ్ టెక్నీకల్ టీం ఈ సినిమా కోసం పని చేస్తుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఆసక్తికర విషయాలని నిర్మాత అశ్వినీదత్ మీడియాతో పంచుకున్నారు.

ఇందులో అమితాబ్ చాలా బలమైన, కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.షూటింగుకి ఆయన 40 రోజులు కేటాయించారు.జనవరి నుంచి షూటింగ్ మొదలెడతాం.ముందుగా ప్రభాస్, దీపికలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తాం.

ఇక ఏప్రిల్ నుంచి అమితాబ్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతారు.తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలలో కచ్చితంగా ఇదొకటి అవుతుంది అని చెప్పారు.

వైజయంతీ మూవీస్ ని ప్రారంభించింది ఎన్టీఆర్.అప్పుడు ఆ లెజండ్ తో చేశా, ఇప్పుడీ లెజండ్ తో చేస్తున్నా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మొత్తానికి అశ్వినీదత్ ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తన మాటలతో స్పష్టత ఇచ్చేశారు.ఆది పురుష్ సినిమాని ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తామని ఓం రావత్ గతంలో చెప్పుకొచ్చారు.

మరి ఈ రెండింటి మధ్య క్లాస్ రాకుండా ప్రభాస్ ఎలా షూటింగ్స్ చేస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube