భార్య అందంపై కుళ్లు జోకు వేసిన వ్యక్తిపై మెగాస్టార్‌ ఆగ్రహం  

Amitabh Bachchan fires on KBC contestant, amitabh bachchan, KBC Contestant, Life, Wife Face Plastic Surgery, Social media, Viral Video,KBC - Telugu Amitabh Bachchan, Amitabh Bachchan Fires On Kbc Contestant, Kbc, Kbc Contestant, Life, Social Media, Viral Video, Wife Face Plastic Surgery

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ సుదీర్ఘ కాలంగా కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షో ను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.ఈ షో సందర్బంగా ఎంతో మంది బాధలను ఆవేదనను విన్న అమితాబచ్చన్‌ వారికి బాసటగా నిలవడంతో పాటు ఎంతో మందికి సాయం చేసేందుకు సిద్దం అయ్యాడు.

TeluguStop.com - Amitabh Bachchan Fires On Kbc Contestent

ఎంతో మంది కన్నీరు గాధలను విన్న మెగాస్టార్ వారికి తన సానుభూతిని తెలియజేయడంతో పాటు వారికి సాంత్వన కలిగించే మాటలు చెప్పాడు.కాని ఈసారి మాత్రం ఆయన ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకు అసహనం వ్యక్తం చేశాడు.

హాట్‌ సీటులో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తప్పుబట్టడమే కాకుండా జీవితంలో మళ్లీ ఎప్పుడు అలాంటి మాటలు మాట్లడకు అంటూ సున్నితంగా హెచ్చరించాడు.మొత్తానికి ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

TeluguStop.com - భార్య అందంపై కుళ్లు జోకు వేసిన వ్యక్తిపై మెగాస్టార్‌ ఆగ్రహం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంతకు ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే.అమితాబచ్చన్‌ తో హాట్‌ సీటులో కూర్చున్న ఆ వ్యక్తి కాస్త ఫన్నీగా మాట్లాడాడు.ఒక ప్రశ్నకు ముందు బచ్చన్‌ మీరు ఈ డబ్బు గెలుచుకుంటే ఏం చేయబోతున్నారు అంటూ ప్రశ్నించాడు.అందుకు సమాధానంగా 15 ఏళ్లుగా తన భార్య మొహం చూడలేక పోతున్నాను.

ఆమెను అందంగా మార్చకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించాలని భావిస్తున్నాను అంటూ సరదాగా అన్నాడు.ఆ వ్యక్తి మాట్లాడింది సరదాగానే అయినా కూడా అమితాబచ్చన్‌కు కోపం వచ్చింది.

భార్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అన్నాడు.ఆ తర్వాత అతడి మాటలను సీరియస్‌ గా తీసుకోవద్దంటూ అతడి భార్య కూడా సూచించింది.

మొత్తానికి ఈ వ్యవహారంలో అమితాబచ్చన్‌ వ్యవరహించిన తీరు అందరికి ఆమోదయోగ్యం అనిపించింది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన ఈ సీజన్‌ ప్రారంభం అయ్యింది.

త్వరలోనే ఈ సీజన్‌ ముగియబతుంది.

#AmitabhBachchan #Life #Social Media #Viral Video #WifeFace

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Bachchan Fires On Kbc Contestent Related Telugu News,Photos/Pics,Images..