జ్ఞానం, వివేకంపై అమితాబ్ బచ్చన్ కామెంట్స్.. ఏం అన్నారంటే?

తన పాత్రలతో భారతదేశపు మొదటి యాంగ్రీ యంగ్ మాన్ గా ప్రసిద్ధి చెందిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్.ఎన్నో యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ మూవీస్ చేసిన ఆయన.

 Amitabh About Knowledge And Wisdom Amitabh Bachchan, Bollywood, Knoweldge, Wisdo-TeluguStop.com

బాలీవుడ్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. హీరోగానే కాక పలు సినిమాలకు నిర్మాతగా మారి మరెంతో మంది మెప్పు పొందారు అమితాబ్.

సినిమా, ఫ్యామిలీతో పాటు.ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు.ఆంధ్రప్రదేశ్ లో అప్పులు తీర్చలేక, నష్టాల్లో మునిగిపోయిన 40మంది రైతుల రూ.11లక్షల అప్పు తీర్చారాయన.ఇలాంటి ఎన్నో సేవలు చేసి అత్యున్నత స్థాయికి ఎదిగారు బిగ్ బి.ఇది అందులో ఒకటే.ఇలా చెప్పుకుంటే పోతే.ఇంకా చాలానే ఉంటాయి.

Telugu Bollywood, Chehra, Knoweldge, Tollywood, Wisdom-Movie

హిందీలోనే కాకుండా.ఇతర భాషల్లోనూ నటించి .తన టాలెంట్ ని ప్రేక్షకులకు మరోసారి చూపించారు అమితాబ్.కథానాయకుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా మారి విశేష ఆదరణ సంపాదించుకున్నారు.

అదే ఆయన హిందీలో ఎప్పటి నుంచో ప్రసార మవుతున్న కేబీసీ.ఇప్పటివరకు 12 సీజన్ లను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో ప్రస్తుతం సీజన్ 13తో ప్రేక్షకులను అలరిస్తోంది.

Telugu Bollywood, Chehra, Knoweldge, Tollywood, Wisdom-Movie

ఒక్కోసారి తెలిసిన విషయమైనా సరే.చెప్పే వ్యక్తిని బట్టి, సమయాన్ని బట్టి.వేటితోనైనా ముడిపెట్టి చెబితే ఆసక్తికరంగా ఉంటుంది.సరిగ్గా అలాంటి మాటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌.ఇటీవలి కాలంలో కేబీసీషోలో పాల్గొన్న ఫొటోను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశారు.ఫొటోకి క్యాప్షన్‌గా జ్ఞానం, వివేకం.

ఈ రెండింటిని టమోట, ప్రుట్‌ సలాడ్‌తో ముడిపెట్టి చెప్పారు.‘‘ టమోట అనేది ఒక పండు అని గుర్తించడం జ్ఞానమైతే అలాంటి టమోటని తీసుకొచ్చి ఫ్రుట్‌ సలాడ్‌లో పెట్టకుండా ఉండటం వివేకం అని లండన్‌ మాజీ ప్రధాని విన్ట్సన్‌ చర్చిల్ అన్న మాటను పోస్టు చేశారు.78ఏళ్ల అమితాబ్‌ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తరచూ జీవితం, ప్రపంచానికి సంబంధించిన పోస్టులు పెడుతూ నిత్యం యాక్టివ్‌గా నెటిజన్లతో టచ్‌లో ఉంటారు.ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 28లక్షలకు పైగా చేరుకుంది.

గతనెల 27న విడుదలైన చెహ్రే లో అడ్వొకేట్‌ వీర్‌ సాహే పాత్రలో అలరించిన అమితాబ్‌.వరుసగా నాలుగు చిత్రాలు.

జూంద్‌, బ్రహ్మాస్త్ర, మే డే, గుడ్‌బైతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube