ఏకంగా 2000 మంది రైతుల అప్పులను తీర్చిన మెగాస్టార్  

Amitab Pays Off Loans Of 2000 Farmers-amitab Bachchan,tollywood Gossips,viral In Social Media

కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా చెయ్యాలి అనే రీతిలో సెలబ్రిటీలు చాలా మంది వ్యవహరిస్తూ ఉంటారు. కొందరు చేసిన చిన్న దానాన్ని కూడా గొప్పగా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మాత్రం గుప్త దానం కిందే ఆయన చర్యలు ఉంటూఉంటాయి..

ఏకంగా 2000 మంది రైతుల అప్పులను తీర్చిన మెగాస్టార్ -Amitab Pays Off Loans Of 2000 Farmers

ఎప్పుడూ ఎవరికీ ఏ అవసరం వచ్చినా కూడా ముందు ఉండే అమితాబ్ తాజాగా రైతుల అప్పులను తీర్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వేళా మంది బీహార్ కు చెందిన రైతుల అప్పులను అమితాబ్ తీర్చినట్లు తెలుస్తుంది. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ లు పాల్గొని వారి చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ నుంచి సాయం అందించారు.

రైతుల రుణాలను చెల్లించడం మెగాస్టార్ అమితాబ్‌కు ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతుల రుణాలను చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే అమితాబ్‌ తన బ్లాగ్‌లో మరో వాగ్దానం నెరవేరాల్సి ఉంది అని, దేశం కోసం పుల్వామా దాడిలో మృతిచెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను, వారి భార్యలను ఆదుకోవాల్సి ఉందని అన్నారు. అమితాబ్ ఇలా రైతులు,అమర వీరుల కుటుంబాలకే కాకుండా సోషల్ అంశాలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు సహాయం చేయడంలో ముందుంటారు.