లాక్ డౌన్ ఎఫెక్ట్.ఒకో సెలబ్రెటీ ఒకో విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఒకరు వంటలు చేసి కళను చూపిస్తే మరికొందరు ఇంట్లోనే హాట్ ఫోటో షూట్ లు చేసి అందరి మతి పోగొడుతున్నారు.ఇంకా నేపథ్యంలోనే బిగ్ బి కూడా తన హాట్ ఫొటోని షేర్ చేశాడు.
హాట్ ఫోటో మాములు ఫోటో కాదు.బికినిలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
కరోనా వైరస్ పై అవగాహనా పెంచుతూనే తన కెరీర్ లో అద్భుతమైన ఘటనలను.దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నాడు.ఇంకా ఈ నేపథ్యంలోనే 37 ఏళ్ళ క్రితం విడుదలైన అతని మహాన్ సినిమా కూడా సంబంధించిన బికినీ ఫోటో షేర్ చేస్తూ దానిపై జోక్ వేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు బిగ్ బి అంత జోక్ ఏం చేశాడు అంటే? బిగ్ బి కామెంట్ చేస్తూ.”ప్రజెంట్ జనరేషన్ చాలా మందికి ఎక్కువగా ఫాలోవర్లు ఉంటున్నప్పుడు నీకు ఎందుకు ఉండటం లేదు? బహుశా నువ్వు ఇన్నర్ దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయకపోవడమే కారణమంటూ కొంతమంది నాతో అన్నారు.అప్పుడే ఈ ఫొటోను నేను పోస్ట్ చేశా.త్రిపాత్రాభినయం చేసిన ‘మహాన్’ సినిమా విడుదలై ఈరోజుకి 37 ఏళ్లయింది” అంటూ షేర్ చేశాడు.ఏది ఏమైనా బిగ్ బి కూడా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్నాడు.