నా సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే బాహుబలి 2 కంటే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవి  

Amitab Baahubali 2 Amar Akbar Anthony - Telugu Amar Akbar Anthony, Amitabh Bachchan, Baahubali 2, Bollywood, Social Media, Theater

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఆయన రెగ్యులర్‌గా ఏదో ఒక ట్వీట్‌, పోస్ట్‌ పెడుతూనే ఉంటారు.

 Amitab Baahubali 2 Amar Akbar Anthony

తాజాగా అమితాబచ్చన్‌ తాను నటించిన అమర్‌ అక్బర్‌ ఆంథోనీ సినిమా 43 యేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.ఎన్నో గుర్తులు ఈ సినిమాతో ఆయనకు ఉన్నాయట.ఆ సినిమా తన కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైన సినిమాల్లో ఒక సినిమా అంటూ అమితాబచ్చన్‌ పేర్కొన్నాడు.

43 యేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 7.25 కోట్ల వసూళ్లను సాధించింది.అప్పట్లో ఈ వసూళ్లు రికార్డు.

నా సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే బాహుబలి 2 కంటే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవి-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతటి వసూళ్లను ఇండియన్‌ సినిమా కనీ విని ఎరుగదు.అంతుకు ముందు వచ్చిన ఎంత పెద్ద హిట్‌ సినిమా అయినా కూడా మూడు నాలుగు కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది.

అద్బుతమైన రికార్డును సొంతం చేసుకున్న అమితాబచ్చన్‌ తాజాగా తన సినిమాను బాహుబలి 2 చిత్రంతో తనకు తానుగా పోల్చుకున్నాడు.

అమర్‌ అక్బర్‌ ఆంథోనీ సినిమా వసూళ్లు ఇప్పటి లెక్క ప్రకారం చూసుకుంటే బాహుబలి 2 చిత్రం కంటే ఎక్కువగా ఉంటాయని అన్నాడు.అప్పట్లో రూపాయి విలువ, అప్పుడు ఉన్న థియేటర్ల సంఖ్య, టికెట్‌ ప్రైజ్‌ ఇలా అన్నింటిని బేరీజు వేసుకుంటే 7.25 కోట్లు అనేది ఖచ్చితంగా 2500 కోట్ల రూపాయలకు పైగానే అంటూ బిగ్‌ బి అభిమానులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test