ప్రభాస్ సినిమాలో ఆయన లేడట!  

Amit Trivedi Not Working For Prabhas Movie - Telugu Amit Trivedi, Pooja Hegde, Prabhas, Prabhas 20, Radhakrishna

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రభాస్ 20’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను జిల్ చిత్ర డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఇది ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

 Amit Trivedi Not Working For Prabhas Movie

ఇక సాహో వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ ఇందులో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల యూరప్ షెడ్యూల్‌ను ముగించుకుంది.

పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో, ఇది పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర రెడీ అవుతున్నారు.

ప్రభాస్ సినిమాలో ఆయన లేడట-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమిత్ త్రివేది ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.ప్రభాస్ 20వ చిత్రానికి తాను సంగీతం అందిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు.

దీంతో ఈ సినిమాకు సంగీతం ఎవరు ఇస్తున్నారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంగీతం అందించిన అమిత్, ప్రభాస్ సినిమా చేయడం లేదని తెలియడంతో ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

మరి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు బాణీలు ఎవరు ఇస్తారా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amit Trivedi Not Working For Prabhas Movie Related Telugu News,Photos/Pics,Images..