అమిత్ షా సభకు పెద్దగా రాని గుర్తింపు... అసలు కారణమిదే?

సౌత్ లో పాగా వేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.తమిళనాడులో పాగా వేద్దామని ప్రయత్నించినా అక్కడ బీజేపీ వ్యూహాలు ఫలించలేదు.

 Amit Shah's House Does Not Get A Big Recognition ... What Is The Real Reas Bjp P-TeluguStop.com

దీంతో బీజేపీకి మరల ఎదురు దెబ్బ తగిలినట్టయింది.అయితే తెలంగాణ రాష్ట్రంపై ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రముఖంగా దృష్టి పెట్టింది.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహం.అందులో భాగంగానే పాదయాత్రలు, సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ వ్యతిరేక పోస్టులతో పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తోంది.అయితే ఈ సారి ఏకంగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజున అమిత్ షాను ఆహ్వానించి ప్రభుత్వాన్ని ప్రజల్లో అభాసుపాలు చేయాలని ప్రయత్నించినా బీజేపీ వ్యూహం మాత్రం ఫలించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కనీసం అమిత్ షా వ్యాఖ్యలకు కనీసం టీఆర్ఎస్ నుండి కౌంటర్ కూడా రాని పరిస్థితి ఉంది.అయితే అమిత్ షా సభకు పెద్దగా గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం ప్రజల్లో విమోచన దినోత్సవం పై పెద్దగా ఆసక్తి లేకపోవడం పెద్దగా మీడియా కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube