అగ్గి రాజేస్తున్న " ఖమ్మం పాలిటిక్స్ " !

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఖమ్మం చుట్టూ తిరుగుతున్నాయి.ప్రధాన పార్టీలన్నీ కూడా ఖమ్మం వైపే చూస్తుండడంతో అసలు ఖమ్మం టార్గెట్ గా ఏం జరగబోతుందా అనే చర్చ అందరిలోనూ మెదులుతోంది.

 Amit Shah Will Visit  To Telangana Khammam ,  Amit Shah  , Khammam ,  Bjp, Ts P-TeluguStop.com

దీనికి కారణం వారం రోజుల వ్యవధిలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖమ్మంలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుండడమే.ఈ నెల 15న అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

అమిత్ షా రాకతో తో ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.మరోవైపు అటు కాంగ్రెస్ కూడా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఈ నెల 20 లేదా 25 నా డేట్ ఫిక్స్ చేసుకుంది.

దీంతో ఒక్కసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల కేంద్రంగా పోలిటికల్ హీట్ రాజుకుంది.

Telugu Amit Shah, Congress, Jupally, Khammam, Ponguleti, Priyanka Gandhi, Rahul

కర్నాటక ఎన్నికల ఓటమి తరువాత తెలంగాణలో కచ్చితంగా గెలిచితీరాలనే పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో 15న తెలంగాణ రానున్న అమిత్ (Amit Shah )షా రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సూచనలు చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.మరోవైపు కర్నాటక ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్.

తెలంగాణలో కూడా అదే విజయాన్ని రిపీట్ చేయాలని చూస్తోంది.అందుకే హస్తం హైకమాండ్ తరచూ టి కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ రాజకీయ వేడి పెంచుతోంది.

ఇక ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ ( Priyanka Gandhi )గాంధీ వచ్చే అవకాశం ఉంది.

Telugu Amit Shah, Congress, Jupally, Khammam, Ponguleti, Priyanka Gandhi, Rahul

ఇక ఎప్పటి నుంచో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్ ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.ఈ నెల 20 లేదా 25 న జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో వీరిద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక మరోవైపు అధికార బి‌ఆర్‌ఎస్( BRS PARTY ) కూడా ఖమ్మం జిల్లాపై గట్టిగానే ఫోకస్ పెట్టింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.దీంతో మూడు ప్రధాన పార్టీలు ఖమ్మం కేంద్రం చేస్తున్న రాజకీయ వ్యూహాలు హాట్ హాట్ డిబేట్లకు కరణమౌతున్నాయి.

మరి వచ్చే ఎన్నికలకు ఖమ్మం నుంచే దండయాత్ర మొదలు పెడుతున్న ప్రధాన పార్టీలలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube