'పరిపూర్ణానంద' తో 'షా' చర్చలు పరిపూర్ణం..ఆ ఎంపీ స్థానం ఫిక్స్   Amit Shah Wants To Give MLA Seat For Paripoornananda     2018-10-09   12:19:39  IST  Surya

యూపీ ఫార్ములాని ఏపీలో అమలు చేయాలని అమిత్ షా ,మోడీలు ఎంతో కాలం నుంచీ వేచి చూస్తున్నారు ఒక పక్క ఏపీ ,తెలంగాణా రాష్ట్రాలలో బీజేపీ ఒంటరిగానే పొత్తులు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తానని గతంలోనే చెప్పడం తో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో అర్థం కాకుండా ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో హిందులకి కొదవలేదు..అయితే వారికి ప్రాతినిధ్యం వహించే నాధుడు లేకపోవడంతో ఆ దిశగానే బీజేపీ ఒక బలమైన నాయకత్వం ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది..అందుకు గాను యూపీలో యోగి ఆదిత్య నాద్ ని ఎలాగైతే ఎన్నికలో బరిలోకి దింపి యూపీలో జెండా ఎగరేసిందో అదే ఫార్ములా తో ఏపీలో కూడా సక్సెస్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలోనే స్వామీజీ పరిపూర్ణనందని తెరపైకి తీసుకువచ్చింది…హిందుత్వంపై హిందూ ధర్మంపై ఎంతో విశేష సేవలు అందిస్తూ తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలలో అశేష భక్తులని అనుచరులని కలిగిఉన్న పరిపూర్ణనంద పైవు బీజేపీ మొగ్గు చూపింది..నిన్నటి రోజున “పరిపూర్ణనంద , షా” లు సమావేశమై సుదీర్ఘమైన చర్చలు జరిగిపిన అనంతరం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి.

ఒకానొక దశలో పరిపూర్ణనందని తెలంగాణ బీజేపీ తరపున సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయిన పరిపూర్ణనందకి హైదరాబాద్ మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు పోటీ చేయించాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది..బీజేపీ నియోకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూరిపూర్ణానంద సేవలను వినియోగించుకోవాలని “మోడీ, షా” లు భావిస్తున్నారట..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది.

Amit Shah Wants To Give MLA Seat For Paripoornananda-

ఇదిలాఉంటే గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచీ భారీ మెజారిటీతో గెలుపొందిన మల్లా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అప్పట్లో మల్లారెడ్డి విషయం వెనుక ఆంధ్ర సెటిలర్ల భాగస్వామ్యం ఉందనేది పచ్చి నిజం దాంతో బీజేపీ పరిపూర్ణానంద ద్వారా టీడీపీ వైపు ఉన్న సెటిలర్లందరినీ…బీజేపీ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు ఏపీలో కూడా బీజేపీ బలపడాలంటే పరిపూర్ణానంద కి కీలక భాద్యతలు అప్పగించి ఆయనతో ప్రచారం చేయించాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు.మరి బీజీపీ కాషాయ వ్యూహం యూపీ లో ఫలించినట్టుగా తెలుగు రాష్ట్రాలలో ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.